IND vs NZ: గీత దాటడం మరువట్లే.. అత్యధిక నో బాల్స్‌తో రికార్డుల చరిత్ర మారుస్తోన్న టీమిండియా పేసర్..!
Ishant Sharma: ఇషాంత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో టీమ్ ఇండియా కోసం చాలాసార్లు మ్యాచ్‌లను గెలిపించాడు. అయితే ఈ సమయంలో అతని కష్టాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
India Vs New Zealand 2021: టీమ్ ఇండియా అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన స్పెల్స్ వేశాడు. ఈ కీలక ప్లేయర్ ప్రతిభతో భారత్ స్వదేశంలో, విదేశాలలో ముఖ్యమైన మ్యాచ్‌లను గెలుచుకుంది. 2007లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 2021 వరకు అంటే 14 సంవత్సరాలలో, ఇషాంత్ కెరీర్ చాలా హెచ్చు తగ్గులను చూసింది. గత కొన్ని సంవత్సరాలలో అతను మరింత ప్రాణాంతక బౌలర్‌గా ఎదిగాడు. అయితే ఇలాంటి సదర్భాలను మరింత మెరుగుపరచుకోలేకపోయాడు. తన బౌలింగ్‌లో కొన్నిసార్లు ఆ లయ కనిపించకుండా పోయింది. ఇషాంత్ తన లైన్-లెంగ్త్‌లో మెరుగ్గా ఉన్నాడు. కానీ బౌలింగ్ చేసేటప్పుడు అతను తరచుగా గీత దాటుతుంటాడు. దానిని నో-బాల్స్ రూపంలో మూల్యం చెల్లించుకునేవాడు. న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌కు ఫర్వాలేదనింపిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతనికి ఎలాంటి వికెట్ పడగొట్టలేదు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో అతనికి పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. కానీ ఈ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య ఒక ఉమ్మడి విషయం ఉంది. అది నో బాల్. మ్యాచ్ చివరి రోజు లంచ్ వరకు ఇషాంత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అందులోనూ అతని ఓవర్‌లో నో బాల్ సంధించాడు. ఈ విధంగా అతను రెండు ఇన్నింగ్స్‌లలో 19 ఓవర్లు బౌలింగే చేశాడు. ఇందులో ఫ్రంట్ ఫుట్‌ను 5 సార్లు క్రీజ్ నుంచి బయటకు దాటించాడు. దీంతో న్యూజిలాండ్ టీం అదనపు పరుగులు పొందింది.
300కు పైగా నో బాల్స్.. ఇషాంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో అతను 35 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేదు. ఈ సమయంలో 4 నో బాల్స్ వేశాడు. ఇఖ రెండో ఇన్నింగ్స్‌లో మొదటి 6 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చాడు. మరోసారి వికెట్ పడగొట్టకుండానే ఖాళీ చేతులతో కనిపించాడు. ఇందులోనూ ఓ రెండు నో బాల్స్ విసిరాడు.
ఈ విధంగా టీమ్ ఇండియా తరఫున 105వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ తన కెరీర్‌లో 314 సార్లు నోబాల్ విసిరాడు. ఇషాంత్ టెస్టు, వన్డే, టీ20 కెరీర్‌లో ఇన్ని నోబాల్స్ సంధించాడు.
ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత జట్టు కేవలం 6 నో బాల్స్ మాత్రమే వేయగా, అందులో 5 ఇషాంత్ నుంచి వచ్చాయి. భారత వెటరన్ పేసర్ తన కెరీర్ ప్రారంభం నుంచి ఈ సమస్యతో పోరాడుతూనే ఉన్నాడు. టెస్టుల్లోనే కాకుండా వన్డే, టీ20 కెరీర్‌లో కూడా ఇషాంత్ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. నోబాల్ సమస్యను మెరుగుపరచడంలో ఇషాన్ ఇంకా పూర్తిగా విజయం సాధించలేదు.
IND vs SA: పొంచి ఉన్న ఓమిక్రాన్ ముప్పు.. భారత్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన ద.ఆఫ్రికా టీం సీఈవో