AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Men’s ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన పాండ్యా, పంత్.. దిగజారిన బుమ్రా..!

మాంచెస్టర్‌లో ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించిన భారత్.. ర్యాంకింగ్‌లో కూడా సత్తా చాటింది. రిషబ్ పంత్113 బంతుల్లో అజేయంగా 125 పరుగులు చేసి 25 స్థానాలు ఎగబాకి

ICC Men's ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన పాండ్యా, పంత్.. దిగజారిన బుమ్రా..!
Venkata Chari
|

Updated on: Jul 20, 2022 | 3:04 PM

Share

ఇంగ్లండ్‌పై భారత్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను గెలుచుకున్నప్పటికీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బౌలర్‌కు భారీ దెబ్బ తగిలింది. మెన్ ఇన్ బ్లూ టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాంచెస్టర్‌లో జరిగిన మూడవ వన్డే నుంచి తప్పుకోవడంతో ఐసీసీ పురుషుల వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి పడిపోయాడు. దీంతో న్యూజిలాండ్ పేస్ స్పియర్ హెడ్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మాట్ హెన్రీ ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అలజరీ జోసెఫ్‌ (మూడు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌), న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ (రెండు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌), నేపాల్‌ లెగ్‌ స్పిన్నర్‌ సందీప్‌ లామిచానె (ఆరు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌), స్కాట్లాండ్‌ సీమర్‌ సఫ్యాన్‌ షరీఫ్‌ (నాలుగు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌) అత్యుత్తమ ర్యాంకులను సొంతం చేసుకున్నారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ కూడా కెరీర్‌లో అత్యుత్తమ మూడో స్థానం సాధించాడు. మంగళవారం చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ చేసిన తర్వాత ICC పురుషుల ODI ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు.

33 ఏళ్ల అతను ఇంగ్లండ్‌పై 117 బంతుల్లో 134 పరుగులు చేసిన తర్వాత మూడు స్థానాలను ఎగబాకాడు. అలాగే ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వాన్ డెర్ డస్సెన్ T20Iలలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాడు. గత ఏడాది జూన్‌లో నాల్గవ ర్యాంక్‌లో నిలిచాడు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికాకు 62 పరుగుల విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన ఐడెన్ మార్క్రామ్ 77 పరుగులతో 15 స్థానాలు ముందుకు కదిలి 61వ ర్యాంక్‌కు చేరుకోగా, ఓపెనర్ జన్నెమన్ మలన్ 57 స్కోరుతో ఒక స్థానం ఎగబాకి 35వ స్థానానికి చేరుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 24 పరుగులతో మూడు స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే 61వ స్థానానికి చేరుకున్నాడు.

మాంచెస్టర్‌లో ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించిన భారత్.. ర్యాంకింగ్‌లో కూడా సత్తా చాటింది. రిషబ్ పంత్113 బంతుల్లో అజేయంగా 125 పరుగులు చేసి 25 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంక్‌కు చేరుకోగా, 55 బంతుల్లో 71 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా 50 నుంచి 42వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌కు చెందిన బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మాట్ హెన్రీ ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అలజరీ జోసెఫ్‌ (మూడు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌), న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ (రెండు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌), నేపాల్‌ లెగ్‌ స్పిన్నర్‌ సందీప్‌ లామిచానె (ఆరు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌), స్కాట్లాండ్‌ సీమర్‌ సఫ్యాన్‌ షరీఫ్‌ (నాలుగు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌) ప్రమోషన్ పొందారు.

ICC పురుషుల T20I ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఐర్లాండ్‌తో జరిగిన వారి సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 69 నాటౌట్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికౌన తర్వాత ఐదు స్థానాలు ఎగబాకి 30వ స్థానానికి చేరుకున్నాడు. అయితే ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ 25 స్థానాల్లో పురోగతి సాధించి, 40వ స్థానానికి చేరుకున్నాడు.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్