- Telugu News Photo Gallery Sports photos Cwg 2022: last time indian Athlets finished 66 medals high with 26 gold medals in commonwealth games check here full details telugu sports news
CWG 2022: మేరీకోమ్ నుంచి నీరజ్ చోప్రా వరకు.. కామన్వెల్త్‌లో సత్తా చాటిన భారత్.. గతేడాది 66 పతకాలు సొంతం..
2018 గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలతో సహా మొత్తం 66 పతకాలను గెలుచుకుంది. షూటింగ్‌లో భారత్ అత్యధికంగా 16 పతకాలు సాధించింది.
Venkata Chari | Edited By: Anil kumar poka
Updated on: Jul 21, 2022 | 5:14 PM

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతసారి కంటే ఈసారి ఎక్కువ పతకాలు సాధించడంపైనే భారత్ దృష్టి నిలిచింది. 2018 గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలతో సహా మొత్తం 66 పతకాలను గెలుచుకుంది. షూటింగ్‌లో భారత్ అత్యధికంగా 16 పతకాలు సాధించింది.

గత కామన్వెల్త్‌లో షూటింగ్‌లో భారత్ 7 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 16 పతకాలు సాధించింది. జీతూ రాయ్, హీనా సిద్ధూ, శ్రేయసి సింగ్, తేజస్వానీ సావంత్, అనీష్ భన్వాలా, సంజీవ్ రాజ్‌పుత్, మను భాకర్ స్వర్ణం సాధించారు.

షూటింగ్ తర్వాత, రెజ్లింగ్‌లో భారత్ అత్యధికంగా 12 పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో 5 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలు సాధించింది. రాహుల్ అవారె, సుశీల్ కుమార్, బజరంగ్ పునియా, సుమిత్ మాలిక్, వినేష్ ఫోగట్ స్వర్ణం సాధించారు.

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ గత కామన్వెల్త్ గేమ్స్‌లో 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో సహా 9 పతకాలు సాధించింది. మీరాబాయి చాను, సంజితా చాను, వెంకట్ రాహు, సతీష్ శివలింగం, పూనమ్ యాదవ్ భారత్‌కు స్వర్ణ పతకాలను అందించారు.

బాక్సింగ్‌లో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 9 పతకాలు సాధించింది. భారత్ తరపున మేరీకోమ్, గౌరవ్ సోలంకి, వికాస్ కృష్ణ యాదవ్ గోల్డెన్ పంచ్ వేశారు.

టేబుల్ టెన్నిస్‌లో భారత్ 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో సహా 8 పతకాలు సాధించింది. మహిళల జట్టు, పురుషుల జట్టుతో పాటు సింగిల్స్‌లో మనిక బత్రా స్వర్ణం సాధించింది.

గత కామన్వెల్త్ బ్యాడ్మింటన్‌లో భారత్ 2 స్వర్ణం, 3 రజతం, ఒక కాంస్యంతో సహా మొత్తం 6 పతకాలు సాధించింది. ఒక స్వర్ణాన్ని మిక్స్‌డ్ జట్టు గెలుచుకోగా, మరో స్వర్ణం సైనా నెహ్వాల్ గెలుచుకుంది.

అథ్లెటిక్స్‌లో భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 1 కాంస్యంతో సహా 3 పతకాలు సాధించింది. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా భారత్‌కు ఏకైక స్వర్ణం అందించాడు.

స్క్వాష్‌లో భారత్‌కు 2 రజత పతకాలు లభించాయి. దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ మిక్స్‌డ్ టీమ్‌ను గెలుచుకున్నారు. మహిళల డబుల్స్‌లో దీపిక, జోసన్నా చినప్ప జంట భారత్‌కు పతకాన్ని అందించింది.

గత కామన్వెల్త్‌లో పవర్‌లిఫ్టింగ్‌లో భారత్ కాంస్యం సాధించింది. ఇందులో సచిన్ చౌదరి విజయం సాధించాడు.





























