- Telugu News Photo Gallery Cricket photos England all rounder Ben stokes retirement net worth salary car collection house
Ben Stokes Retirement: ఇంగ్లండ్ క్రికెటర్లలోనే అత్యధిక సంపాదన.. ఈ ఆల్‌రౌండర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ODI క్రికెట్‌లో, స్టోక్స్ 39కి పైగా సగటుతో దాదాపు 3000 పరుగులు చేశాడు. రీసెంట్‌గా ఇంగ్లండ్‌కి టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Updated on: Jul 18, 2022 | 8:06 PM

ఇంగ్లండ్ దిగ్గజ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డే తర్వాత అతను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కానున్నాడు. 31 ఏళ్ల బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ 2019 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ODI క్రికెట్‌లో, స్టోక్స్ 39కి పైగా సగటుతో దాదాపు 3000 పరుగులు చేశాడు. రీసెంట్‌గా ఇంగ్లండ్‌కి టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

బెన్ స్టోక్స్ గురించి మాట్లాడుతూ, అతను అత్యధిక పారితోషికం తీసుకునే ఇంగ్లీష్ క్రికెటర్‌గా నిలిచాడు. నివేదికల ప్రకారం, ECB బెన్ స్టోక్స్‌కు ఏటా $3.36 మిలియన్లు అంటే దాదాపు రూ.27 కోట్లు చెల్లిస్తుంది.

బెన్ స్టోక్స్ నికర విలువ గురించి మాట్లాడితే, అతను 11 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువనే ఉంది. అతని ప్రధాన ఆదాయ వనరు క్రికెట్. ఇది కాకుండా, అతను IPL నుంచి కూడా చాలా ఎక్కువ డబ్బు సంపాదించాడు.





























