AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: ‘టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్ చేరే 4 జట్లు ఇవే.. లిస్టులో వరుస పరాజయాల టీంకు చోటు’

T20 World Cup 2024: ఈ టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. టైటిల్ కోసం ఈ జట్ల మధ్య 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, USA కూడా ఉన్న గ్రూప్ A లో భారతదేశం ఉంది. ఇది కాకుండా గ్రూప్-బిలో ఇంగ్లండ్, గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి.

T20 World Cup 2024: 'టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్ చేరే 4 జట్లు ఇవే.. లిస్టులో వరుస పరాజయాల టీంకు చోటు'
T20 World Cup 2024
Venkata Chari
|

Updated on: Apr 27, 2024 | 11:02 AM

Share

Yuvraj Singh Predicts 4 Semifinalists Of T20 World Cup 2024: ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ (IPL 2024) జరుగుతోంది. ఈ మిలియన్ డాలర్ల టోర్నీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆ తర్వాత, T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కేవలం ఒక వారంలో ప్రారంభమవుతుంది. ఈ పొట్టి ఫార్మాట్ జూన్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి మొత్తం 20 జట్లను మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టీ20 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా ఎంపికైన టీమిండియా (Team India) మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh).. ఈ ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్ ఆడనున్న 4 జట్లను పేర్కొన్నాడు.

ఒక ఆశ్చర్యకరమైన ఎంపిక..

ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు సెమీఫైనల్స్‌ ఆడనున్నాయని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. అయితే, యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన 4 జట్లలో కేవలం 1 జట్టు మాత్రమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన 4 జట్లలో పాకిస్థాన్ జట్టుపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే గత ఏడాది నుంచి పాకిస్థాన్ జట్టు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అలాగే జట్టులోని ఆటగాళ్లు ఎవరూ రాణించలేదు. అయితే, యువరాజ్ సింగ్ పాకిస్థాన్ జట్టును ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

20 జట్లు 55 మ్యాచ్‌లు..

ఈ టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. టైటిల్ కోసం ఈ జట్ల మధ్య 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, USA కూడా ఉన్న గ్రూప్ A లో భారతదేశం ఉంది. ఇది కాకుండా గ్రూప్-బిలో ఇంగ్లండ్, గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గ్రూప్ A- ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, USA

గ్రూప్ B- ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ సి- న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా

గ్రూప్ డి- దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

భారత జట్టు షెడ్యూల్..

టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా తమ ప్రచారాన్ని జూన్ 5 నుంచి ప్రారంభించనుంది. టీం ఇండియా తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత జూన్ 9న భారత్-పాక్ మధ్య టోర్నీలోనే ఉత్కంట మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 12న USA, జూన్ 15న కెనడాతో టీమిండియా తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..