IPL 2024: చారిత్రాత్మక విజయంతో ముంబై భారీ షాకిచ్చిన పంజాబ్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లోనూ కీలక మార్పులు..

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి దిగజారింది. ఆరెంజ్ క్యాప్ రేసులో సునీల్ నరైన్ రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో హర్షల్ పటేల్ ఇప్పుడు 14 వికెట్లతో పర్పుల్ క్యాప్ కోసం మొదటి పోటీదారుగా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రాను వెనక్కు నెట్టాడు.

IPL 2024: చారిత్రాత్మక విజయంతో ముంబై భారీ షాకిచ్చిన పంజాబ్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లోనూ కీలక మార్పులు..
Ipl 2024 Purple And Orange list
Follow us

|

Updated on: Apr 27, 2024 | 11:40 AM

IPL 2024: ఐపీఎల్ 2024 (IPL 17వ సీజన్‌)లో 42వ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విధంగా, ప్రస్తుత సీజన్‌లో పంజాబ్ తన మూడో విజయాన్ని నమోదు చేయడం ద్వారా ప్లే ఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ సునీల్ నరైన్ (71), ఫిల్ సాల్ట్ (75) అద్భుతమైన అర్ధ సెంచరీల సహాయంతో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (54), జానీ బెయిర్‌స్టో (108*), శశాంక్‌ సింగ్‌ (68*) చెలరేగడంతో పంజాబ్‌ జట్టు ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి దిగజారింది. ఆరెంజ్ క్యాప్ రేసులో సునీల్ నరైన్ రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో హర్షల్ పటేల్ ఇప్పుడు 14 వికెట్లతో పర్పుల్ క్యాప్ కోసం మొదటి పోటీదారుగా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రాను వెనక్కు నెట్టాడు.

ఇవి కూడా చదవండి

IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే..

1) రాజస్థాన్ రాయల్స్ – 8 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లు

2) కోల్‌కతా నైట్ రైడర్స్ – 8 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

3) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 8 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

4) లక్నో సూపర్‌జెయింట్స్ – 8 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

5) చెన్నై సూపర్ కింగ్స్ – 8 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

6) ఢిల్లీ క్యాపిటల్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

7) గుజరాత్ టైటాన్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

8) పంజాబ్ కింగ్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

9) ముంబై ఇండియన్స్ – 8 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 9 మ్యాచ్‌ల తర్వాత 4 పాయింట్లు

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఎవరంటే?

1- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 9 మ్యాచ్‌ల తర్వాత 430 పరుగులు

2- సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్): 8 మ్యాచ్‌ల తర్వాత 357 పరుగులు

3- రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్): 8 మ్యాచ్‌ల తర్వాత 349 పరుగులు

ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు ఎవరంటే?

1- హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్): 9 మ్యాచ్‌ల తర్వాత 14 వికెట్లు

2- జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్): 8 మ్యాచ్‌ల తర్వాత 13 వికెట్లు

3- యుజ్వేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్): 8 మ్యాచ్‌ల తర్వాత 13 వికెట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..