AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఒక్క ట్వీట్‌తో టార్గెట్‌గా మారిన టీమిండియా ఫాస్ట్ బౌలర్.. ఫత్వా జారీ చేయాలంటూ డిమాండ్.. ఎందుకంటే?

Mohammad Shami: షమీపై ఫత్వా జారీ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. షమీ చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించి బెదిరింపులు వస్తున్నాయి. తన ట్వీట్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఓ సందేశాన్ని రాసుకొచ్చాడు.

Team India: ఒక్క ట్వీట్‌తో టార్గెట్‌గా మారిన టీమిండియా ఫాస్ట్ బౌలర్.. ఫత్వా జారీ చేయాలంటూ డిమాండ్.. ఎందుకంటే?
Mohammad Shami
Venkata Chari
|

Updated on: Oct 06, 2022 | 8:40 AM

Share

టీమిండియా ఆస్ట్రేలియా బయల్దేరింది. కానీ, ఇక్కడ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా విమానంలో కూర్చోవాల్సిన మహమ్మద్ షమీ.. కొంతమంది టార్గెట్‌కు గురయ్యాడు. షమీకి బెదిరింపు సందేశాలు కూడా వస్తున్నాయి. ఆయనపై ఫత్వా జారీ చేయాలని ఛాందసవాదులు కామెంట్లు చేస్తున్నారు. షమీ చేసిన ఓ ట్వీట్‌.. ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద రచ్చ చేస్తోంది. తన ట్వీట్‌లో భారత ఫాస్ట్ బౌలర్ దసరా శుభాకాంక్షల సందేశాన్ని షేర్ చేశాడు. కానీ, ఆయన ఇలా ట్వీట్ చేయడం కొంతమంది ఛాందసవాదులకు మాత్రం నచ్చలేదు.

జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత, టీమిండియాలో రేసులో ముందంజలో నిలిచాడు. కానీ, ప్రస్తుతం జట్టు నిష్క్రమణ తర్వాత, ఈ వార్త షమీ కష్టాలను మరింత పెంచింది.

ఇవి కూడా చదవండి

దసరా శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్..

షమీని టార్గెట్ చేస్తూ కొంతమంది టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. దసరా శుభాకాంక్షలతో షమీ ఓ ట్వీట్ చేశాడు. షమీ తన ట్వీట్‌లో రాముడి ఫొటోని షేర్ చేశాడు. “ఈ పవిత్రమైన దసరా పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, విజయాన్ని తీసుకురావాలని నేను శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు” అంటూ ఫ్యాన్స్‌కు, సహచరులకు, నెటిజన్లను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

ఫత్వా జారీ చేయాలంటూ డిమాండ్..

షమీ చేసిన ఈ ట్వీట్‌తో కొంతమంది రెచ్చిపోయారు. దీనిని ఓ అవకాశంగా తీసుకుంటూ బెదిరించారు. ఆయనపై ఫత్వా జారీ చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఛాందసవాదుల ప్రకారం దసరా శుభాకాంక్షలు చెప్పడం నేరంగా పరిగణిస్తున్నారు.

మిగతా టీమ్ ఇండియా ఆటగాళ్లతో షమీ ఆస్ట్రేలియా వెళ్లలేదు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. అంతా సవ్యంగా జరిగితే భారత్ వార్మప్ మ్యాచ్‌లకు ముందే షమీ ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చని తెలుస్తోంది.