Virat Kohli: తన కొత్త రెస్టారెంట్ ను సందర్శించిన విరాట్ కోహ్లీ.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..
ప్రపంచ క్రికెటల్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుని, విశ్వ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. అయితే క్రికెట్ తో పాటు.. వ్యాపార రంగంపై కూడా ఈ స్టార్ క్రికెటర్ కు మక్కువ ఉండటంతో పలు రంగాల్లో..
ప్రపంచ క్రికెటల్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుని, విశ్వ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. అయితే క్రికెట్ తో పాటు.. వ్యాపార రంగంపై కూడా ఈ స్టార్ క్రికెటర్ కు మక్కువ ఉండటంతో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘూష్, క్లాత్, హాస్పిటాలిటీ రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. దీనిలో భాగంగా ఢిల్లీతో పాటు కోల్ కతా, పూనేలో రెస్టారెంట్స్ ను ఇప్పటికే నడిపిస్తున్నాడు. తాజాగా ముంబైలో కూడా తానుమ ఓ రెస్టారెంట్ ను ఏర్పాటుచేయనుండగా విరాట్ కోహ్లీ ఈ రెస్టారెంట్ ను సందర్శించాడు. తన జెర్సీ నెంబర్ 18 వచ్చేలా వన్8కమ్యూన్ పేరుతో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ముంబైలో ప్రారంభించబోయే రెస్టారెంట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ ఏర్పాటుచేస్తున్నారు. ముంబైలోని కిశోర్ కుమార్ కు చెందిన గౌరీ కుంజ్ పోర్షన్ ను కోహ్లీ దంపతులు ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. త్వరలోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించనుండగా.. విరాట్ కోహ్లీ తాజాగా ముంబైలో ప్రారంభించబోయే రెస్టారెంట్ ను సందర్శించాడు.
విరాట్ కోహ్లీ టాలిస్మానిక్ బ్యాటర్ ‘వన్8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లను ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాడు. తాజాగా ముంబైలోని లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో రెస్టారెంట్ ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నాడో కోహ్లీ వివరించాడు. తనకు కిశోర్ దాస్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన పాడిన పాటలు వ్యక్తిగతంగా తన హృదయాన్ని తాకాయని, తనను ఎంతో ప్రభావితం చేశాయని మనీష్ పాల్ తో మాట్లాడుతూ చెప్పాడు. తన కాన్సెప్ట్ కు సరిగ్గా సరిపోతుందని, అందుకే ఈ బంగ్లాలో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక ద్వీపంలో ఒక అబ్బాయిని ఒంటరిగా వదిలేస్తే.. అతను ఎవరితో ఉండాలనుకుంటున్నాడని అడిగితే .. ఆ అబ్బాయినుంచి కిషోర్ దా అని సమాధానం వచ్చింది. ఇంతకీ ఆ సమాధానం ఎవరి నుంచి అనుకుంటున్నారా.. కోహ్లీ నుంచే అని మనీష్ పాల్ తెలిపాడు. కిశోర్ దా జీవించి ఉంటే ఆయనను కలిసేవాడినని కోహ్లీ తెలిపాడు. తనకు ఇష్టం లేకపోతే తాను ఏ పనిచేయనని, తనతో అనుసంధానించబడిన వ్యక్తుల కోసం తాను ఏదైనా చేస్తానని కూడా విరాట్ కోహ్లీ తన మనసులోని మాటను ఈ సందర్భంగా బయట పెట్టాడు. మొత్తం మీద విరాట్ కోహ్లీ తన తరువాత రెస్టారెంట్ ను ముంబైలో ప్రారంభించబోతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..