Yuvaraj Viral Video: తల్లి పై ప్రాంక్ చేసిన యువరాజ్.. ఆమె రియాక్షన్ ఎంత ఇన్నోసెంట్‌గా ఉందో..

Viral Video: డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. యువరాజ్ ఫన్‌కు, ఎనర్జీకి కేరాఫ్ అంటారు. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ, నవ్వుతూ ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అయితే ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన యాక్టివిటీకి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం వీడియోలు షేర్ చేస్తుంటాడు. తాజాగా యూవీ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలొ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు […]

Yuvaraj Viral Video: తల్లి పై ప్రాంక్ చేసిన యువరాజ్.. ఆమె రియాక్షన్ ఎంత ఇన్నోసెంట్‌గా ఉందో..
Yuvraj
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 04, 2022 | 8:07 AM

Viral Video: డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. యువరాజ్ ఫన్‌కు, ఎనర్జీకి కేరాఫ్ అంటారు. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ, నవ్వుతూ ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అయితే ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన యాక్టివిటీకి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం వీడియోలు షేర్ చేస్తుంటాడు. తాజాగా యూవీ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలొ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ అతని చేతికి పిజియేథెరపీ కిట్‌ను పెట్టింది. దానిని 15 నిమిషాలపాటు అప్లై చేస్తే నొప్పి పోతుందని షబ్నమ్.. యువరాజ్‌కు వివరిస్తుంది. అయితే, ఈ సమయంలో కూర్చీపై కూర్చున్న యువరాజ్.. తన తల్లిని ఆటపట్టించాడు. ఆ ఎక్విప్‌మెంట్ గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. ఆమె సదరు పరికరం ప్రయోజనాలను వివరిస్తుండగా.. యువరాజ్ ఓపికగా తన తల్లి మాటలు వింటున్నాడు. అయితే, చివరగా తన ఎడమ చేతికి గాయమైతే.. నా కుడి చేతికి ఎందుకు పెట్టావు అని యూవీ తన తల్లిని ప్రశ్నిస్తాడు. దాంతో అరెరె.. యూవీ.. అంటూ ఆ ఎక్విప్‌‌మెంట్‌ను తొలగిస్తుంది. అయితే, ఈ సన్నివేశాన్నంతటినీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. యూవీ తన తల్లిపై చేసిన ప్రాంక్‌ను చూసి తెగ నవ్వుకుంటున్నారు. క్రికెట్ ప్లేయర్లు సైతం ఈ వీడియోకు రియాక్ట్ అవుతున్నారు. క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also read:

Parenting Tips: మీ పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..