AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: అమ్మో.. విరాట్ అప్పట్లో అలా ఉండేవాడా!.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన సహ క్రికెటర్లు..

Virat Kohli 100 Test:   మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో కీలక మైలురాయి చేరుకోబోతున్నారు. ఇవాళ 100వ టెస్ట్‌ ఆడనున్నాడు.

Virat Kohli: అమ్మో.. విరాట్ అప్పట్లో అలా ఉండేవాడా!.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన సహ క్రికెటర్లు..
Kohli Cricket
Shiva Prajapati
|

Updated on: Mar 04, 2022 | 9:16 AM

Share

Virat Kohli 100 Test:   మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో కీలక మైలురాయి చేరుకోబోతున్నారు. ఇవాళ 100వ టెస్ట్‌ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో 2008 అండర్-19 ప్రపంచ కప్‌లో కోహ్లీతో ఆడిన ఇద్దరు భారతీయ క్రికెటర్లు.. తమ మాజీ కెప్టెన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కోహ్లి టెస్టుల్లో సెంచరీ ఆడిన 12వ భారత క్రికెటర్‌గా అవతరించి, అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా, ఫాస్ట్ బౌలర్ ప్రదీప్ సాంగ్వాన్ కూడా చేరారు. అయితే.. వీరిద్దరూ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోహ్లి భోజన ప్రియుడు, ఫుడ్ తినేందుకు ఏమాత్రం వెనుకాడకపోయేది అని సాంగ్వాన్ వెల్లడించాడు. జంక్ ఫుడ్ పట్ల ఆసక్తి చూపేవాడన్నారు. అయితే, కోహ్లీ దృఢ సంకల్పం కూడా అంతేస్థాయిలో ఉండేదని చెప్పుకొచ్చారు.

‘‘కోహ్లీ ఎంతటి ఆహార ప్రియుడో నాకు తెలుసు. చాలా ఎక్కువగా తినేవాడు. మటన్-రైస్, జంక్ ఫుడ్ సహా ప్రతిదీ తినేవాడు. నచ్చిన ఆహారం కోసం చాలా దూరం కూడా వెళ్లేవాడు.’’ అని సాంగ్వాన్ చెప్పుకొచ్చాడు.

‘‘2010లో కోహ్లీ ఢిల్లీ రంజీ జట్టు కోసం ఆడటానికి వచ్చినప్పుడు.. చాలా డిఫరెంట్‌గా కనిపించాడు. ప్రతిదీ భిన్నంగా ఉండేది. ఫుడ్ ఎక్కువగా తినేవాడు. ఒకేసారి 200 ml కంటే ఎక్కువ డ్రింక్స్ తాగేవాడు. రైస్-మటన్ కర్రీని డైట్ ఫుడ్‌తో కవర్ చేస్తాడు. అలాంటి కోహ్లీ.. నేడు తనను తాను ఎంతగా మార్చుకున్నాడో చూసి ఆశ్చర్యపోయాను. ఐపీఎల్ కోహ్లీని కలిశాను.  తన ఫిట్‌నెస్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పుడు చూసినా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటాడు. మిగతా క్రికెటర్ల కంటే కోహ్లీ చాలా భిన్నం.’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఎడమచేతి వాటం స్పిన్నర్ అబ్దుల్లా 2008 ప్రపంచ కప్‌లోని ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు.. ‘‘కెప్టెన్‌గా, కోహ్లి ప్రపంచ కప్ ట్రోఫీ కోసం చాలా కష్టపడ్డాడు. గ్రౌండ్‌లో కోహ్లీ నా ఫీల్డ్ పొజిషన్‌ను మార్చాడు. అయితే, ఆ తరువాత ఆ విషయాన్ని మర్చిపోయాడు. నేను డీప్ మిడ్‌వికెట్‌లో ఉన్నాను. బ్యాట్స్‌మన్ బంతిని స్క్వేర్ లెగ్‌కి కొట్టినప్పుడు, కోహ్లీ వెంటనే నన్ను అక్కడ ఫీల్డింగ్‌కి పంపాడు. ఆ తరువాత బంతి మిడ్‌వికెట్‌లోకి వెళ్లింది, కోహ్లి సహనం కోల్పోయాడు. దాంతో నేను జరిగిన విషయాన్ని కోహ్లీకి గుర్తు చేశాడు. అప్పుడు కోహ్లీ కూల్ అయ్యాడు. దాని గురించి తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది.’’ అని చెప్పుకొచ్చాడు అబ్దుల్లా.

Also read:

TATA Motors: ఇక ఇంటి వద్దకే కార్లు.. టాటా మోటర్స్‌ వినూత్న కార్యక్రమం..!

IND vs SL, 1st Test, Day 1 Live Score: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?

Viral Video: కొడుకు కోసం దేనికైనా రెడీ.. ప్రాణాలకు తెగించిన తండ్రి.. వీడియో చూస్తే షాకే..