Sachin – Kohli: పాజీ ఇక చాలు అంటూ కోహ్లీ.. నాటి ఇంట్రస్టింగ్ సీన్‌ను గుర్తు చేసిన సచిన్..

Sachin - Kohli: పాజీ ఇక చాలు అంటూ కోహ్లీ.. నాటి ఇంట్రస్టింగ్ సీన్‌ను గుర్తు చేసిన సచిన్..
Kohli

Virat Kohli 100 Test Match: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. శుక్రవారం భారత్‌ తరఫున 100వ టెస్టు ఆడనున్న విరాట్‌ కోహ్లికి

Shiva Prajapati

|

Mar 04, 2022 | 7:43 AM

Virat Kohli 100 Test Match: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. శుక్రవారం భారత్‌ తరఫున 100వ టెస్టు ఆడనున్న విరాట్‌ కోహ్లికి సంబంధించి ఆసక్తికరమైన మ్యాటర్‌ను రివీల్ చేశారు. విరాట్‌కు సంబంధించిన ఆసక్తికర  సన్నివేశాన్ని గుర్తూ చేస్తూ టెండూల్కర్ పోస్ట్ చేసిన వీడియోను.. బీసీసీఐ సైతం షేర్ చేసింది. ఈ వీడియోలో.. 2011లో తాను, కోహ్లీ థాయ్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. అప్పుడు కోహ్లీ వయసు 23. ఫుల్లుగా భోజనం లాగించేవాడట. ఆ తరువాత ఫిట్‌నెస్ అంటూ పరుగులు తీసేవాడట.

టీమిండియా క్రికెటర్లలో ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ మించిన వాళ్లు ఈ తరంలో గానీ, నాటి తరంలో గానీ ఉన్నారా? అంటే లేరనే చెప్పవచ్చు. ఫిట్‌నెస్‌పై కోహ్లీ అంత శ్రద్ధ పెడతారు మరి. తన ఫెట్‌నెస్‌తో ఇతర ఆటగాళ్లకు రోల్‌మోడల్‌గా నిలిచాడు కోహ్లీ. అయితే కోహ్లీతో సచిన్ ‌చాలా క్లోజ్‌గా ఉండేవాడు.. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక వీడియో షేర్ చేశారు. ‘‘మేము 2011లో ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఉన్నాం. నాకు ఖచ్చితంగా గుర్తుంది. అక్కడ ఒక థాయ్ రెస్టారెంట్ ఉంది. మేము అక్కడికి వెళ్లి హ్యాపీగా గడిపేవాళ్ళం. నచ్చిన భోజనం చేసి, తిరిగి హోటల్‌కి వెళ్లేవాళ్ల. ఒకరోజు సాయంత్రం, రెస్టారెంట్‌లో ఫుల్లుగా భోజనం చేసి తిరిగి వెళ్లేందుకు సిద్ధమమ్యాం. ఆ సమయంలో మీరు నాతో ‘పాజీ ఇక చాలు.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలి అని అన్నారు. మొత్తానికి మీరు అన్న మాట ప్రకారం ఫిట్‌నెస్ సాధించి చూపారు. లక్ష్యాన్ని చేరుకున్నారు.’’ అంటూ నాటి సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను కోహ్లీకి పంపించాడు సచిన్ టెండూల్కర్.

‘‘మిరు తిరుగులేని లేని మైలురాయిని చేరుకున్నారు. ఫిట్‌నెస్‌కు సంబంధించినంతవరకు మీరు అద్భుతమైన రోల్ మోడల్‌గా ఉన్నారు. సహజంగానే, క్రికెట్‌లో సంఖ్యలు అనేది పూర్తిగా భిన్నమైన కథ. ఇది ప్రపంచం చూడటం మంచిది. కానీ అది ఒక ప్రత్యేకమైనది సాయంత్రం, నాకు స్పష్టంగా గుర్తుంది. మీరు ఫిట్‌నెస్‌పై పోకస్ పెట్టాలని చెప్పారు. మీ లక్ష్యాన్ని సాధించారు. సంవత్సరాలుగా మిమ్మల్ని టీమిండియాలో చూడటం చాలా అద్భుతంగా ఉంది. క్రికెట్‌లో నెంబరింగ్ అనేది ఎల్లప్పుడూ వారి స్వంత అస్థిత్వాన్ని కలిగి ఉంటాయి. తరువాతి తరాన్ని ప్రేరేపించగలిగే శక్తి మీ సొంతం.. అదే మీ నిజమైన బలం. ఇది భారత క్రికెట్‌కు మీరు చేసిన అపారమైన సహకారం. అదే మీ నిజమైన విజయం అని నేను చెప్పగలను. మీ క్రికెట్ కెరీర్ హ్యాపీగా సాగాలి. అద్భుతంగా రాణించండి. గుడ్ లక్.’’ అంటూ 100 వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీకి అభినందనలు తెలిపారు సచిన్.

ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా సచిన్ షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియోను బీసీసీఐ సైతం షేర్ చేసింది.

కాగా, సచిన్ రిటైరయ్యే ముందు 2008 నుంచి 2013 వరకు ఐదేళ్లపాటు టెండూల్కర్, కోహ్లీ సహచరులుగా ఉన్నారు. వారిద్దరూ కలిసి 2011 ప్రపంచ కప్‌ ట్రోఫీలోనూ ఆడారు. భారత జట్టుకు అనేక చిరస్మరణీయ మ్యాచ్‌లలో ఇద్దరూ భాగమయ్యారు. కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు.

Also read:

Parenting Tips: మీ పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Puttaparthi: ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగాలని.. ప్రపంచ శాంతి కోరుతూ విదేశీయులు పుట్టపర్తిలో ప్రత్యేక హోమం

NSE IFSC: అమెరికా కంపెనీల షేర్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ లాంటి ఇన్వెస్టర్లకే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu