Puttaparthi: ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగాలని.. ప్రపంచ శాంతి కోరుతూ విదేశీయులు పుట్టపర్తిలో ప్రత్యేక హోమం

Puttaparthi: రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అనేక దేశాల ప్రజలు ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించి శాంతి బాటలో పయనించాలని..

Puttaparthi: ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగాలని.. ప్రపంచ శాంతి కోరుతూ విదేశీయులు పుట్టపర్తిలో ప్రత్యేక హోమం
Vishwa Shanthi Homam At Pu
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2022 | 7:27 AM

Puttaparthi: రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అనేక దేశాల ప్రజలు ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించి శాంతి బాటలో పయనించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా(Anantapuram District)లో ఉక్రెయిన్ రష్యా దేశాలు యుద్దాన్ని విరమించి శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ విదేశీయులు ప్రత్యేక హోమం నిర్వహించారు. ప్రపంచ శాంతి నెలకొనాలని దుర్గాదేవి, సాయిబాబాను వేడుకుంటూ శాంతి హోమం జరిపించారు విదేశీయులు.

జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో విదేశీయులు విశ్వ శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక హోమం నిర్వహించారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ముగిసి పోవాలని ప్రపంచంలో శాంతి నెలకొనాలని భగవాన్ సత్యసాయి బాబా, దుర్గా దేవిని ప్రార్థిస్తూ దుర్గాదేవి ఆలయంలో వేద బ్రాహ్మణుడు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాంతి హోమం చేశారు. కరోనా రక్కసి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మానవాళిలో అశాంతిని రాజేసిందన్నారు. యుద్ధం వీలైనంత త్వరగా పరిసమాప్తం కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళి సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

విద్వేషాలు వివక్ష మాని మనుషులందరూ ప్రశాంత జీవితం సాగించాలని కోరుకున్నారు. విద్వేషాలకు లోనవుతున్న వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వారు ప్రార్థించారు. ప్రపంచ దేశాల్లో మానవాళికి ఇబ్బందులు కలుగకుండా సమన్వయంతో సత్సంబంధాలు కలిగి ఉండాలని వారు నవగ్రహ, గణపతి హామాలతో పాటు శాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో విదేశీ భక్తులతో పాటు స్థానికులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read:

ఈరోజు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి..నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!