Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి..నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (04-03-2022): వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా.. చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుందని అనుకుంటారు.. ఈరోజు తమకు మంచి జరుగుతుందా..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి..నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2022 | 6:35 AM

Horoscope Today (04-03-2022): వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా.. చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుందని అనుకుంటారు.. ఈరోజు తమకు మంచి జరుగుతుందా.. లేక చేడు జరుగుతుందా అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 4వ వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

  1. మేష రాశి: ఈరోజు ఈ రాశివారుప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు,మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.
  2. వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు.  కుటుంబ సభ్యులతో తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది.
  3. మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సొంతం చేసుకుంటారు. చేపట్టిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు.
  4. కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. ఫ్యామిలీ వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.
  5. సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
  6. కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  7. తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాల్లో తగిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుని పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంది. బంధు, మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  8. వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మెలగాలి. మానసిక విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయాల్సి ఉంటుంది.
  9. ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సకాలంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు.  కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
  10. మకర రాశి: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా వ్యవహరించి పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు తమ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
  11. కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసర ఖర్చులు చేస్తారు.
  12. మీన రాశి: ఈరోజు ఈరాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. అతిగా ఎవరిని నమ్మకండి. కీలకపనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఆత్మబలంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

KCR Tour: నేడు జార్ఖండ్‌కు సీఎం కేసీఆర్‌.. అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం..