AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umesh Yadav: టీమిండియా స్టార్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఇంట తీవ్ర విషాదం.. మూడో టెస్టుకు దూరం?

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌​ ఉమేష్ యాదవ్​ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి తిలక్ యాదవ్​ (74) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్​ యాదవ్​ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Umesh Yadav: టీమిండియా స్టార్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఇంట తీవ్ర విషాదం.. మూడో టెస్టుకు దూరం?
Umesh Yadav
Basha Shek
|

Updated on: Feb 24, 2023 | 6:15 AM

Share

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌​ ఉమేష్ యాదవ్​ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి తిలక్ యాదవ్​ (74) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్​ యాదవ్​ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఖపర్ఖేడా, మిలన్​ చౌక్​లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. తిలక్ యాదవ్ తన ఇంట్లో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న క్రికెటర్లు ఉమేశ్‌ ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఉమేష్ ప్రస్తుతం తన కుటుంబంతో ఉన్నాడు ఎందుకంటే ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత, టీమ్ ఇండియాకు 5 రోజుల విరామం లభించింది. కాగా తిలక్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. చాలా ఏళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం నాగ్‌పూర్‌కు వచ్చాడు. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో ఉద్యోగం సంపాదించి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనకు ఉమేశ్‌ కాకుండా మరో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక ఉమేష్ తల్లి కూడా చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఇదిలా ఉంటే ఉమేష్ తండ్రి తిలక్​కు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన తన తనయుడు ఉమేష్​ను మాత్రం పోలీసు లేదా మిలిట్రీలో చేర్చాలనుకున్నారు.

అయితే ఉమేష్ యాదవ్​కు మాత్రం క్రికెట్​ అంటే పిచ్చి. కుమారుడి ఇష్టాన్ని కాదనలేని తిలక్‌ అందుకు తన పూర్తి మద్దతునిచ్చాడు. ఈక్రమంలోనే తన ఫెర్మామెన్స్‌తో మొదట రంజీల్లో చోటు దక్కించుకున్నాడు. ఆతర్వాత భారత జట్టులో ఆడే చాన్స్ దక్కించుకున్నాడు. 2010లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఉమేశ్‌.. స్టార్‌ పేసర్‌గా ఎదిగాడు. ఇక తాజాగా బోర్డర్‌ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్ట్‌ మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు తండ్రి కన్నుమూయడంతో మూడో టెస్టుకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్