IND vs AUS 2023: ఆస్ట్రేలియా పాలిట విలన్‌లా ‘హిట్’మ్యాన్.. ఈ రికార్డులు చూస్తే బౌలర్లకు కంగారే..

Rohit Sharma: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు కీలక పాత్ర పోషించనున్నాడని రికార్డులు చెబుతున్నాయి. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో రోహిత్ సగటు 73.33గా నిలవడంతో..

IND vs AUS 2023: ఆస్ట్రేలియా పాలిట విలన్‌లా 'హిట్'మ్యాన్.. ఈ రికార్డులు చూస్తే బౌలర్లకు కంగారే..
ఈ క్రమంలో రోహిత్ టెస్టు కెప్టెన్సీకి ఇదొక పరీక్ష లాంటిది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై తప్పక నెగ్గాలి. ప్రస్తుతం రోహిత్ మీదున్న అతి పెద్ద బాధ్యత ఇదే.
Follow us

|

Updated on: Feb 03, 2023 | 8:00 AM

Rohit Sharma IND vs AUS: భారత జట్టు ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. ఇందులో నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఢిపరెంట్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఫోకస్ అంతా హిట్‌మ్యాన్‌పైనే ఉంది. సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు భారత కెప్టెన్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తుందని రికార్డులు చెబుతున్నాయి.

స్వదేశంలో ఆడిన టెస్టుల్లో రోహిత్ శర్మ లెక్కలు ఇవే..

భారత గడ్డపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 20 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో మొత్తం 30 ఇన్నింగ్స్‌ల్లో అతను 73.33 సగటుతో మొత్తం 1760 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 7 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని అత్యధిక స్కోరు 212 పరుగులుగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌ల్లో అతను 6 సార్లు అజేయంగా వెనుదిరగగా, ఒకసారి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 45 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 77 ఇన్నింగ్స్‌లలో, అతను 46.13 సగటుతో మొత్తం 3137 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఇవి కూడా చదవండి

2017లో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా..

గతంలో 2017లో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించింది. ఆ పర్యటనలో భారత జట్టు 2-1తో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో 333 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో భారత్‌ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, సిరీస్‌లోని నాలుగో, చివరి మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..