Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India 2023: కొత్త సంవత్సరం.. కొంగొత్త ఆశలు.. ఈ ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆశలతో ప్రపంచ క్రికెట్ వేదికపై ఆధిపత్యం చెలాయించేందుకు టీమిండియా సిద్ధమైంది.ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌లోనే జరగనుంది. టీమిండియా దృష్టంతా ప్రస్తుతం ఈ మెగా టోర్నీపైనే ఉంది. స్వదేశంలో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని తహతహలాడుతోంది.

Team India 2023: కొత్త సంవత్సరం.. కొంగొత్త ఆశలు.. ఈ ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2023 | 7:22 AM

భారత జట్టుకు 2022 సంవత్సరం పెద్దగా అచ్చిరాలేదు. ఈ ఏడాది రెండు పెద్ద టోర్నీల్లో విఫలమైన టీమిండియా .. ఆసియా కప్-2022లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేదు. అదే సమయంలో ICC T20 ప్రపంచ కప్‌లోనూ రాణించలేకపోయింది సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో ఓడిపోవడంతో నిష్క్రమించింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆశలతో ప్రపంచ క్రికెట్ వేదికపై ఆధిపత్యం చెలాయించేందుకు టీమిండియా సిద్ధమైంది.ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌లోనే జరగనుంది. టీమిండియా దృష్టంతా ప్రస్తుతం ఈ మెగా టోర్నీపైనే ఉంది. స్వదేశంలో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని తహతహలాడుతోంది. 2011లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత్ చివరిగా గెలుచుకుంది. అలాగే శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో టీమిండియా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. మరి ఈ ఏడాది భారత జట్టు ఆడే మ్యాచ్‌లు, షెడ్యూల్‌ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

లంకతో మొదలై..

ఈ ఏడాదిని టీమిండియా మొదట శ్రీలంకను ఢీకొట్టనుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది.

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌

ఇవి కూడా చదవండి

1వ T20 – జనవరి 3, వాంఖడే స్టేడియం, ముంబై 2వ T20 – జనవరి 5, MCA స్టేడియం, ముంబై 3వ T20 – జనవరి 7, SCA స్టేడియం, రాజ్‌కోట్

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌

1వ ODI – జనవరి 10, బర్సపరా స్టేడియం, గౌహతి 2వ ODI – జనవరి 12, ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్‌కతా 3వ ODI – జనవరి 15, గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా

మొదటి వన్డే – జనవరి 18, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ రెండో వన్డే – జనవరి 21, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్ మూడో వన్డే – జనవరి 24, హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్

1వ T20 – 27 జనవరి, JSCA ఇంటర్నేషనల్ స్టేడియం, రాంచీ 2వ T20 – 29 జనవరి, ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో 3వ T20 – 1 ఫిబ్రవరి, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన

1వ టెస్ట్, 9-13 ఫిబ్రవరి, VCA స్టేడియం, నాగ్‌పూర్ 2వ టెస్ట్, 17-21 ఫిబ్రవరి, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ 3వ టెస్ట్, మార్చి 1-5, HPCA స్టేడియం, ధర్మశాల

1వ ODI, మార్చి 17 – వాంఖడే స్టేడియం, ముంబై 2వ ODI, మార్చి 19 – VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం 3వ ODI, మార్చి 22 – MA చిదంబరం స్టేడియం, చెన్నై

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్‌లో జరగనుంది. మరి ఈ టోర్నీ ఫైనల్‌కు భారత జట్టు చేరుతోందా లేదా అన్నది చూడాలి. ఈ ఛాంపియన్‌షిప్‌ను కూడా జూన్‌లో నిర్వహించనున్నారు. తేదీలు ప్రకటించలేదు కానీ జూన్ రెండో వారంలో ప్రారంభం కావచ్చు.

వెస్టిండీస్ భారత పర్యటన

జూలై-ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు.

ఆస్ట్రేలియా టూర్‌ ఆఫ్‌ ఇండియా

ఫిబ్రవరి-మార్చిలో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్‌లో భారత్‌కు తిరిగి వచ్చి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. దీని తర్వాత నవంబర్‌లో ఆస్ట్రేలియా మళ్లీ భారత్‌కు వచ్చి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

ACC ఆసియా కప్-2023

అక్టోబర్‌లో జరిగే ఆసియా కప్‌లో టీమిండియా ఆడడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరుగుతుండడంతో భారత్‌ ఆడదని బీసీసీఐ చెబుతోంది. దీంతో టోర్నీ వేదిక మారే అవకాశం ఉంది. అలాగే మ్యాచ్‌ల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

దక్షిణాఫ్రికా పర్యటనతో ముగింపు

ఏడాది చివర్లో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్‌ నుంచి ఈ టూర్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో