Rishabh Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్.. వైద్యులు ఏమంటున్నారంటే?
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం టీమ్‌ఇండియా వికెట్‌కీపర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతను వేగవంతంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పంత్ నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్‌కు చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపాడు.
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో పంత్ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు కానీ అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పంత్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలంటూ టీమిండియా అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈనేపథ్యంలో క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు హెల్త్ అప్‌డేట్‌లు వస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం టీమ్‌ఇండియా వికెట్‌కీపర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతను వేగవంతంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పంత్ నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్‌కు చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపాడు. ఇక ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే ఉమేష్‌కుమార్ ఎప్పటికప్పుడు పంత్ ఆరోగ్య పరిస్థితిన సమీక్షిస్తున్నారు. ‘ప్రస్తుతం పంత్‌ను వేరే ఆసుపత్రికి తరలించే ఆలోచన లేదు. అతని పరిస్థితి చాలా మెరుగుపడింది. పంత్ నుదుటికి చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మొదటి డ్రెస్సింగ్ కూడా చేశారు .రిషబ్ చికిత్సలో మంచి పురోగతి కనిపిస్తోంది. అతన్ని వేరే ఆసుపత్రికి తరలించాలా వద్దా అని వైద్యులు ఇంకా నిర్ణయించలేదు. పంత్ త్వరగా కోలుకుంటాడన్న నమ్మకం ఉంది’ అని ఎమ్మెల్యే తెలిపారు.
ఆస్పత్రికి ప్రముఖులు..
కాగా పంత్ సోదరి సాక్షి పంత్ తన సోదరుడితో జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలిసిన వెంటనే డెహ్రాడూన్ చేరుకున్నారు. సాక్షి లండన్‌లో ఉండగా, ప్రమాద వార్త తెలిసిన వెంటనే అక్కడి నుంచి భారత్‌కు పయనమైంది. శనివారం ఉదయమే ఆమె డెహ్రాడూన్ చేరుకుంది. అక్కడ నుండి నేరుగా పంత్ చికిత్స పొందుతున్న మాక్స్ ఆసుపత్రికి చేరుకుంది. ఇక పంత్ పరిస్థితిని తెలుసుకునేందుకు బీసీసీఐ, ఢిల్లీ క్రికెట్ అధికారులు కూడా శనివారం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. అతనితో పాటు, ఢిల్లీ క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ భాగస్వామి, నితీష్ రాణా కూడా అతనిని కలవడానికి ఆసుపత్రికి చేరుకున్నారు. తన స్నేహితుడి పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ కూడా పంత్‌ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చారు. క్రికెటర్ ఆరోగ్యంపై వాకబు చేశారు.
ख़ुशी के पल और परिवार के लिए राहत की खबर । देहरादून के मैक्स हॉस्पिटल जाकर @RishabhPant17 से ICU में मुलाक़ात की । स्थिति नियंत्रण में है जल्दी ही ईश्वर की अनुकंपा से वो हमारे बीच होगा । बड़ी बहन ऋषभ पंत की माता जी , ऋषभ की बहन साक्षी , क्रिकेटर नीतीश राणा और परिवार के सदस्य pic.twitter.com/ydlRZoOyTa
— Umesh Kumar (@Umeshnni) December 31, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..