AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ప్రైజ్ మనీ.. విజేతకు దక్కేది ఎంతంటే?

T20 World Cup 2026 Prize Money: టీ20 ప్రపంచకప్ 2026 కోసం అన్ని జట్లు రెడీ ఉన్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రైజ్ మనీ ఎంతో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వామ్మో.. భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ప్రైజ్ మనీ.. విజేతకు దక్కేది ఎంతంటే?
T20 World Cup 2026 Prize Money
Venkata Chari
|

Updated on: Jan 30, 2026 | 5:46 PM

Share

T20 World Cup 2026 Prize Money: టీ20 ప్రపంచకప్ 2026 కోసం సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్, శ్రీలంక దేశాలు పూర్తి సన్నద్ధం చేశాయి. ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న ఐసీసీ మెగా ఈవెంట్ కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం.. 2024 ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్ పూల్‌ను సుమారు 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో మొత్తం ప్రైజ్ పూల్ $11.25 మిలియన్లుగా ఉండగా, ఇప్పుడు దానిని $13.5 మిలియన్లకు (సుమారు రూ. 120.37 కోట్లు) పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజేతగా నిలిచే జట్టుకు దక్కే నగదు కూడా భారీగా పెరిగింది.

పెరిగిన నగదు బహుమతులు..

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్‌లో జరగబోయే ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ బడ్జెట్‌ను పెంచింది. 2024లో విజేత జట్టుకు $2.45 మిలియన్లు (సుమారు రూ. 20.42 కోట్లు) లభించగా, 2026లో ఛాంపియన్‌గా నిలిచే జట్టు ఏకంగా $3 మిలియన్ల (సుమారు రూ. 27.48 కోట్లు) నగదును సొంతం చేసుకోనుంది.

ఫైనలిస్టులకు ఎంత దక్కుతుంది?

రన్నరప్ (ద్వితీయ స్థానం) గా నిలిచే జట్టు కూడా తక్కువ ఏమీ కాదు. రన్నరప్ జట్టుకు $1.6 మిలియన్ల (సుమారు రూ. 14.65 కోట్లు) నగదు బహుమతిగా అందుతుంది. అంటే ఫైనల్ చేరిన రెండు జట్లు కోట్లలో నగదును తీసుకెళ్లనున్నాయి.

సెమీఫైనలిస్టులు, ఇతర జట్లు..

సెమీఫైనల్‌లో ఓడిపోయిన రెండు జట్లకు ఒక్కొక్కదానికి $7,90,000 (సుమారు రూ. 7.23 కోట్లు) లభిస్తాయి. అలాగే టోర్నీలో 5 నుంచి 12వ స్థానాల మధ్య (సూపర్ 8 నుంచి నిష్క్రమించే జట్లు) నిలిచే జట్లకు ఒక్కొక్కదానికి $3,80,000 (సుమారు రూ. 3.48 కోట్లు) అందుతాయి. గ్రూప్ దశలోనే వెనుదిరిగే (13 నుంచి 20 స్థానాలు) జట్లకు కూడా కనీస భాగస్వామ్య రుసుము కింద $2,50,000 (సుమారు రూ. 2.29 కోట్లు) లభించనున్నాయి.

స్టేజ్ ప్రైజ్ మనీ (USD) ప్రైజ్ మనీ (INR)
ఛాంపియన్ 3 మిలియన్లు రూ. 27,47,79,000
రన్నరప్ 1.6 మిలియన్లు రూ. 14,65,48,800
సెమీ-ఫైనలిస్టులు ఒక్కొక్కరికి $790,000 ఒక్కొక్కరికి రూ. 7,23,58,470
5-12 జట్లు ఒక్కొక్కరికి $380,000 ఒక్కొక్కరికి రూ. 3,48,05,340
13 – 20 జట్లు ఒక్కొక్కరికి $250,000 ఒక్కొక్కరికి రూ. 2,28,98,250

ఈ భారీ ప్రైజ్ మనీ పెంపు కేవలం పెద్ద జట్లకే కాకుండా, చిన్న జట్లకు (ఉగాండా, నమీబియా వంటివి) కూడా ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది. టోర్నీలో పాల్గొనడం వల్ల వచ్చే ఆదాయం ఆయా దేశాలలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా సమరంలో టైటిల్ గెలిచి రూ. 27 కోట్లను ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి.!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..