IPL 2023: సన్ రైజర్స్‌కు సవాల్.. ఇవాళ పంజాబ్‌తో మ్యాచ్.. వరుస పరాజయాల నుంచి గట్టేక్కెనా..?
ఐపీఎల్ 16 టోర్నీలో హైదరబాద్ టీం సన్ రైజర్స్ కు సవాల్ ఎదురైంది. ఇవాళ 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే పంజాజ్ కింగ్స్ లెవన్ తో తలపడుతుంది ఎస్ఆర్హెచ్. ఇప్పటికే ఐపీఎల్-16లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కుంటుందా? అనే బిగ్ క్వశ్చన్ గా మారింది ఫ్యాన్స్ లో. ఇవాళ్టి మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు ముమ్మర ప్రాక్టీస్ చేశాయి.
ఐపీఎల్ 16 టోర్నీలో హైదరబాద్ టీం సన్ రైజర్స్ కు సవాల్ ఎదురైంది. ఇవాళ 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే పంజాజ్ కింగ్స్ లెవన్ తో తలపడుతుంది ఎస్ఆర్హెచ్. ఇప్పటికే ఐపీఎల్-16లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కుంటుందా? అనే బిగ్ క్వశ్చన్ గా మారింది ఫ్యాన్స్ లో. ఇవాళ్టి మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు ముమ్మర ప్రాక్టీస్ చేశాయి. ఈ ఏడాది ఐపీఎల్ లో SRH వరుసగా రెండు ఓటములు చవిచూసింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిన హైదరాబాద్ టీమ్, రెండో మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. స్వదేశీ మ్యాచీల్లో సూపర్ సిట్ గా ఆడిన ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ ఐపీఎల్ మినీ వేలంలో రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. కెప్టెన్ మార్కం సైతం లక్నోతో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఇక స్వదేశీ ప్లేయర్లు మయాంక, రాహుల్ త్రిపాఠీ ఘోరంగా ఆడుతున్నారు. ఆడిన రెండు మ్యాచీల్లో వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలర్లు విషయానికొస్తే.. భువనేశ్వర్, నటరాజన్, మాలిక్ ఘోరంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. ఆల్ రౌండర్ అదిల్ రసీద్ కాస్తా పర్వాలేదని అనిపించారు.
హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారా అసంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త బ్యాటింగ్ వల్లే ఓడిపోతున్నామని చెప్పారు. ఈ సీజన్‌లో ఎస్ఆర్ఎచ్ బ్యాటింగ్ ప్రదర్శన బాగాలేదని తేల్చిచెప్పారు. ఇకపై బ్యాటర్ల తీరు మారకుంటే చాలా కష్టమవుతుందన్నారు లారా. లోపాలు సరి చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయని లారా తెలిపారు.
ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. మొహాలీ వేదికగా ఆడిన తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఏడు పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ విధానంలో) ఓడించింది. అలాగే రాజస్తాన్ రాయల్స్ తో గువహతి వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ప్లేయర్స్ సైతం అన్ని విభాగాల్లో సూపర్బ్ అనిపిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న పంజాబ్.. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కూడా సత్తా చాటి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తుంది. చూడాలి పంజాబ్ కు హ్యాట్రిక్ విజయమో.. సన్ రైజర్స్ కు హ్యాట్రిక్ ఓటమో..
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం..