IPL 2023: జడేజానా.. మజాకా..! క్యాచ్ చూస్తే ఒళ్ళు జలదరించాల్సిందే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుస ఓటములు వెంటాడుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతుల్లో ఓడిన ముంబై ఇండియన్స్.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా ఓటమిపాలైంది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుస ఓటములు వెంటాడుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతుల్లో ఓడిన ముంబై ఇండియన్స్.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా ఓటమిపాలైంది. దీంతో ఐపీఎల్ సీజన్ 16లో ముంబై వరుసగా.. రెండు మ్యాచ్‌లను చేజార్చుకుంది. శనివారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 7 వికట్ల తేడాతో చెన్నైపై ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. చెన్నై బౌలర్ల ధాటికి 157 పరుగులు చేసింది. జడేజా (3/20), శాంట్నర్ (2/28)ల ధాటికి ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి.. 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జడేజాకు దక్కింది.
అయితే, ఈ ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కళ్లు మూసి పట్టిన ఆ క్యాచ్‌ను చూసి అంతా షాకయ్యారు. పెవిలియన్ చేరిన కామెరూన్ గ్రీన్ (12) కూడా ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 8.2 వ బంతిని గ్రీన్ షాట్ ఆడగా.. ఎవరు ఊహించని రీతిలో జడేజా క్యాచ్‌ను పట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గ్రీన్ షాట్ కొట్టగానే బంతి నేరుగా.. జడేజా వైపు దూసుకొచ్చింది. అయితే, జడేజా కాస్త బెండ్ అయి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో అంపైర్ సైతం పక్కకు తప్పుకుంటూ కనిపించాడు.
వీడియో చూడండి..
Sensational catch ??@imjadeja grabs a RIPPER off his own bowling!
Follow the match ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/HjnXep6tXF
— IndianPremierLeague (@IPL) April 8, 2023
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం..