అతను ఆల్ రౌండర్ కాదు.. ఓన్లీ బ్యాటర్ మాత్రమే.. పిలిచి మరీ ఛాన్స్‌లు ఎందుకిస్తున్నావ్ గంభీర్..?
India vs Afghanistan T20: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావంతోనే ఆటగాళ్లను ఎంపిక చేశారని ఆరోపించిన బద్రీనాథ్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదని, కేవలం బ్యాటర్ మాత్రమే అని అభిప్రాయపడ్డారు.

India vs Afghanistan T20: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు ఎంపికలో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, ఆయనకు ఇష్టమైన ఆటగాళ్లే తిరిగి జట్టులోకి వచ్చారని బద్రీనాథ్ ఆరోపించారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ, అతను ఆల్‌రౌండర్ కాదని, కేవలం బ్యాటర్ మాత్రమేనని, బౌలింగ్‌లో ఎలాంటి గొప్ప ప్రతిభ లేదని తీవ్ర విమర్శలు చేశారు. బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తిరిగి చోటు సంపాదించుకున్నారు. అయితే, జింబాబ్వే పర్యటనకు వెళ్లిన రింకూ సింగ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్‌లను ఈ సిరీస్‌కు సెలక్టర్లు తప్పించారు. చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి అవకాశం దక్కలేదు.
గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే, వీరు ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ సెలక్షన్ ప్రక్రియపై బద్రీనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్‌కు ఇష్టమైన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. వాషింగ్టన్ సుందర్‌కు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయని, వాటిని అతను సద్వినియోగం చేసుకోవాలని బద్రీనాథ్ సూచించారు. నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే, అతను నా దృష్టిలో ఆల్‌రౌండర్ కాదని, గొప్ప బౌలర్‌గా నేను చూడనని స్పష్టం చేశారు. నితీష్ రెడ్డి కేవలం బ్యాటర్ మాత్రమేనని, బౌలింగ్‌లో అతని గొప్ప ప్రతిభ ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ జట్టుకు గొప్ప బలాన్నిస్తుందని బద్రీనాథ్ అంగీకరించారు. బుమ్రా స్వయంగా గంభీర్, సెలక్షన్ కమిటీతో మాట్లాడి తాను ఆడాలనుకుంటున్నానని చెప్పి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత గాయం కారణంగా బుమ్రా క్రికెట్‌కు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత అతను తిరిగి జట్టులోకి రావడం శుభపరిణామమని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో, అఫ్గానిస్థాన్‌తో జరిగే ఈ టీ20 సిరీస్‌కు ప్రాధాన్యత పెరిగిందని బద్రీనాథ్ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



