AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Vaibhav Sooryavanshi Video: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ఔటవ్వడానికి కారణం ఎవరు, అసలు బుడ్డోడు ఔటవ్వడం వెనుక ఎవరున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. అందులో తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ ఒకరినొకరు తలపడడం చూడొచ్చు.

Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Vaibhav Sooryavanshi Verbal Exchange With Tilak Varma
Venkata Chari
|

Updated on: Sep 06, 2026 | 4:56 PM

Share

Vaibhav Sooryavanshi Video: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ నేటి నుంచి మొదలైంది. ముందుగా బ్యాటింగ్ చేస్తోన్న ఈస్ట్ జోన్ అద్భుతమైన ఆరంభం అందుకోవడమే కాకుండా, భారీ స్కోర్ దిశగా దూసుకపోతుంది. తొలి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే, టీమిండియా సెన్సెషన్ వైభవ్ సూర్యవంశీ ఔటవడంతో సెంచరీ భాగస్వామ్యం బద్దలైంది. బుడ్డోడు సౌత్ జోన్ బౌలర్ మిలింద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే, అంతకు ముందు మైదానంలో జరిగిన పరిణామాలే వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోవడానికి కారణమయ్యాయని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగబ్బాయి, వైభవ్‌కు మధ్య ఓ వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.

గొడవ పడిన వైభవ్, తిలక్..

దులీప్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ గొడవపడిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ, తిలక్ స్టంప్ మైక్ ద్వారా, “ఏంటి వైస్ కెప్టెన్?” అని అనడం వినిపించింది.

44 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ ఔట్..

తిలక్ వర్మతో వైభవ్ సూర్యవంశీ ఉన్న ఈ వీడియో, అతను ఔటవ్వడానికి కొద్ది క్షణాల ముందు చోటు చేసుకుంది. సూర్యవంశీ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.

దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఈస్ట్ జోన్‌కు బలమైన ఆరంభాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు పూర్తి 100 పరుగులు జోడించిన సంగతి తెలిసిందే.

వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ కెరీర్..

దులీప్ ట్రోఫీ ఫైనల్ వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ కెరీర్‌లో 11వ మ్యాచ్ కాగా, ఫైనల్‌లో అతను ఆడిన తొలి ఇన్నింగ్స్ 16వది. ఈ కాలంలో అతను రెండు హాఫ్ సెంచరీలతో 381 పరుగులు సాధించాడు. వైభవ్ ఒక అర్ధశతకాన్ని రంజీ ట్రోఫీలో, మరొక అర్ధశతకాన్ని సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో సాధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా
చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్
చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్
కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే!
కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే!
ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!
ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!
ధర తక్కువ.. సౌండ్ ఎక్కువ.. సౌత్‌టెక్‌ స్పీకర్ స్పెషాలిటీస్ ఇవే
ధర తక్కువ.. సౌండ్ ఎక్కువ.. సౌత్‌టెక్‌ స్పీకర్ స్పెషాలిటీస్ ఇవే
ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
పితృ పక్షం ఎప్పుడు? శ్రాద్ధం, తర్పణం చేసేటప్పుడు దక్షిణం వైపే..
పితృ పక్షం ఎప్పుడు? శ్రాద్ధం, తర్పణం చేసేటప్పుడు దక్షిణం వైపే..
ఆంధ్ర స్టైల్ స్పెషల్ చికెన్ కర్రీ.. ఇదొక్కటి వేస్తే నీచు వాసనరాదు
ఆంధ్ర స్టైల్ స్పెషల్ చికెన్ కర్రీ.. ఇదొక్కటి వేస్తే నీచు వాసనరాదు
ఆడియన్స్ గెట్ రెడీ..
ఆడియన్స్ గెట్ రెడీ..