AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs PAK: 8 సిక్సర్లు, 4 ఫోర్లు.. బౌలర్ల బ్యాండ్ బజాయించిన పంత్ కొత్త భాగస్వా మి.. 40 బంతుల్లో అరాచకం

పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ 205.00 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు కూడా కొట్టాడు. తన జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

SA vs PAK: 8 సిక్సర్లు, 4 ఫోర్లు.. బౌలర్ల బ్యాండ్ బజాయించిన పంత్ కొత్త భాగస్వా మి.. 40 బంతుల్లో అరాచకం
David Miller Vs Pakistan
Venkata Chari
|

Updated on: Dec 11, 2024 | 7:03 AM

Share

South Africa vs Pakistan, 1st T20I: పాకిస్థాన్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభమైంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ, జట్టుకు ఆరంభం చాలా చెడ్డదిగా మారింది. దక్షిణాఫ్రికా 28 పరుగులకే తొలి 3 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత, తుఫాన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ బ్యాట్ నుంచి తుఫాను ఇన్నింగ్స్ కనిపించింది. మైదానంలో చుట్టూ బౌండరీలు కొడుతూ బౌలర్లపై విధ్వంసం స‌ృష్టించాడు.

డేవిడ్ మిల్లర్ తుఫాన్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. అతను క్రీజులోకి వచ్చేసరికి దక్షిణాఫ్రికా 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత, డేవిడ్ మిల్లర్ జట్టు ఇన్నింగ్స్‌కు బాధ్యత వహించాడు. తరువాత వేగంగా పరుగులు చేసి ఫోర్లు, సిక్సర్లు బాదాడు. అతను 40 బంతుల్లో 205.00 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో, డేవిడ్ మిల్లర్ కూడా అబ్రార్ అహ్మద్‌పై మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.

రిషబ్ పంత్‌తో కలిసి మిల్లర్ బరిలోకి..

డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ చివరి సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, అతను ఇప్పుడు లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడబోతున్నాడు. IPL 2025 మెగా వేలంలో మిల్లర్ రూ. 1.5 కోట్ల బేస్ ధరతో ప్రవేశించాడు. అదే సమయంలో, లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేయడానికి 7 రెట్లు ఎక్కువ అంటే రూ. 7.50 కోట్లు ఖర్చు చేసింది. రిషబ్ పంత్‌ను కూడా లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు కొనుగోలు చేసింది. కాబట్టి, ఈ ఇద్దరు తుఫాన్ ఆటగాళ్లు వచ్చే సీజన్‌లో కలిసి ఆడతారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

183 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా..

డేవిడ్ మిల్లర్ ధాటికి దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్‌తో పాటు, జార్జ్ లిండే కూడా జట్టు తరపున తుఫాన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతను 24 బంతుల్లో 200.00 స్ట్రైక్ రేట్‌తో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మినహా మరే బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల మార్కును తాకలేకపోయారు. కాగా, పాకిస్థాన్ తరపున అబ్రార్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిది తలో 3 వికెట్లు తీశారు. అబ్బాస్ అఫ్రిది కూడా 2 వికెట్లు తీయగలిగాడు. సుఫియాన్ ముఖీమ్ కూడా 1 వికెట్ దక్కించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..