- Telugu News Photo Gallery Cricket photos Shaheen Afridi becoming the first Pakistan bowler to reach 100 wickets in all formats etched his name in cricket history
SA vs PAK: చరిత్ర సృష్టించిన పాక్ డేజంరస్ పేసర్.. ఎలైట్ లిస్ట్‌లో చోటు..
South Africa vs Pakistan, 1st T20I: పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో పాక్ పేసర్ ఓ చారిత్రాత్మక రికార్డ్‌ను సాధించాడు.
Updated on: Dec 11, 2024 | 7:38 AM

Shaheen Afridi: అంతర్జాతీయ క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో 100 వికెట్లు మైలురాయిని సాధించిన తొలి పాక్ బౌలర్‌గా స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది క్రికెట్ చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నాడు. మంగళవారం డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ చారిత్రాత్మక ఫీట్ జరిగింది.

పవర్‌ప్లేలో ఒకసారి, మిడిల్ ఓవర్‌లలో ఒకసారి, డెత్త్ ఓవర్లలో మరోసారి మూడు వికెట్లు తీసి ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడానికి షాహీన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

ఈ 24 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ షాహీన్ 3/22 స్పెల్‌తో తన 100వ T20I వికెట్‌ను సాధించాడు. వన్డేలలో 112, టెస్ట్ క్రికెట్‌లో 116 వికెట్లు తన ఖాతాలో చేర్చుకున్నాడు. హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్‌లతో కలిసి 100 టీ20ఐ వికెట్లు సాధించిన మూడవ పాకిస్థానీ బౌలర్‌గా కూడా షాహీన్ నిలిచాడు.

ముఖ్యంగా, షాహీన్ తన 74వ T20Iలో ఈ మైలురాయిని సాధించాడు. 71 మ్యాచ్‌లలో దీనిని సాధించిన హారిస్ రవూఫ్ తర్వాత మైలురాయికి చేరుకున్న రెండవ వేగవంతమైన పాకిస్థానీగా నిలిచాడు.

అదే సమయంలో, షాహీన్ న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌతీ, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్, శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ ఎలైట్ క్లబ్‌లో చేరి, అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు.




