Sourav Ganguly: టీమిండియా హెడ్ కోచ్‌ పదవి.. గంగూలీ సంచలన ట్వీట్.. గంభీర్ రావడం ఇష్టం లేదా?

|

Jun 01, 2024 | 6:51 PM

టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవీడ్ పదవీకాలం ముగుస్తుంది. దీని తర్వాత అంటే జూలై 1న టీమిండియాకు కొత్త ప్రధాన కోచ్‌ రానున్నాడు. ఇందుకోసం బీసీసీఐ దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కోచ్ గా కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున టైటిల్ గెలిచిన గౌతమ్ గంభీర్ పేరు మాత్రం ముందంజలో ఉంది.

Sourav Ganguly: టీమిండియా హెడ్ కోచ్‌ పదవి.. గంగూలీ సంచలన ట్వీట్.. గంభీర్ రావడం ఇష్టం లేదా?
Sourav Ganguly, Gautam Gambhir
Follow us on

టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవీడ్ పదవీకాలం ముగుస్తుంది. దీని తర్వాత అంటే జూలై 1న టీమిండియాకు కొత్త ప్రధాన కోచ్‌ రానున్నాడు. ఇందుకోసం బీసీసీఐ దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కోచ్ గా కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున టైటిల్ గెలిచిన గౌతమ్ గంభీర్ పేరు మాత్రం ముందంజలో ఉంది. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెక్రటరీ జై షా మైదానంలో చర్చలు జరిపారు. దాంతో గౌతమ్ గంభీర్ పేరు ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా ప్రధాన కోచ్ పేరును ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘ఒక ఆటగాడి జీవితంలో కోచ్‌ పదవి అత్యంత కీలకమైంది. మార్గదర్శిగా, కనికరం లేని శిక్షణతో మైదానంలో అత్యుత్తమ ప్లేయర్‌గా మార్చాల్సిన బాధ్యత ఉంటుంది. వ్యక్తిత్వపరంగానూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కోచ్‌ పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు కాస్త తెలివిని ప్రదర్శించాలి’’ అని గంగూలీ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. కోచ్ గా గంభీర్ పేరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ గంగూలీ చేసిన ఈ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరును గంగూలీ వ్యతిరేకిస్తున్నారా? అసలు సౌరవ్ గంగూలీ మైండ్‌లో ఏముందోననే చర్చలు మొదలయ్యాయి.

క్రికెటర్‌గా, గౌతమ్ గంభీర్ భారత్‌ను రెండుసార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో మెరుగ్గా ఆడాడు. ఇక ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ట్రోఫీని కూడా అందించాడు. తాజాగా తన మెంటార్ షిప్ తో మరోసారి కోల్ కతాను చాంపియన్ గా నిలబెట్టాడు. ఈ నేపథ్యంలో కోచ్ గా గౌతీ పేరు ముందంజలో ఉందని తెలుస్తోంది. కొత్త కోచ్ పదవీకాలం మూడున్నరేళ్లు. ఇందులో టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. ఇప్పుడు టీమ్ ఇండియా కోచ్ ఎవరు? అనే క్యూరియాసిటీ తారాస్థాయికి చేరుకుంది. గౌతమ్ గంభీర్‌కు అవకాశం వస్తుందా లేక మరొకరు ఈ పదవిని అలంకరిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

 

గంగూలీ ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..