Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాల్ తగిలి వేలు రూపురేఖలే మారాయి.. కట్‌చేస్తే.. రక్తం కారుతున్నా బౌలింగ్‌కు సిద్ధమైన బౌలర్..

Vitality Blast: క్రీడా ప్రపంచంలో ఎందరో మొండి పట్టుదలగల ఆటగాళ్లను చూసే ఉన్నాం. గాయంతోపాటు నొప్పులు అన్నీ మరిచిపోయి.. తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో మునిగిపోతారు. చేతులు, కాళ్ళు, ముఖం రక్తం కారుతున్నా.. ఆడటం కొనసాగిస్తూనే ఉంటారు.

Viral Video: బాల్ తగిలి వేలు రూపురేఖలే మారాయి.. కట్‌చేస్తే.. రక్తం కారుతున్నా బౌలింగ్‌కు సిద్ధమైన బౌలర్..
Roelof Van Der Merwe
Follow us
Venkata Chari

|

Updated on: Jun 21, 2023 | 5:30 AM

క్రీడా ప్రపంచంలో ఎందరో మొండి పట్టుదలగల ఆటగాళ్లను చూసే ఉన్నాం. గాయంతోపాటు నొప్పులు అన్నీ మరిచిపోయి.. తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో మునిగిపోతారు. చేతులు, కాళ్ళు, ముఖం రక్తం కారుతున్నా.. ఆడటం కొనసాగిస్తూనే ఉంటారు. అయితే, ఇలాంటి వారిని చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఓ బౌలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాల్ తగలడంతో వేలి ఎముక మెలితిరిగినా.. కొద్దిసేపటికే బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

సోమర్‌సెట్ బౌలర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే బంతిని ఆపే సమయంలో వేలి ఛిద్రమైంది. తన బౌలింగ్‌లోనే రివర్స్ వచ్చిన బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి అతని వేలికి తాకింది. బంతి తగిలిన వెంటనే మెర్వ్ నొప్పితో ఇబ్బంది పడ్డాడు.అతని వేలి మెలితిరి పోయినట్లు వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఫిజియో ఎంట్రీతో.. బరిలోకి బౌలర్..

మార్వ్ మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అతను ఫిజియోకి తన వేలిని చూపించాడు. అదే సమయంలో ఫిజియో అతని వేలిని లాగి కొద్దిగా సరిదిద్దాడు. ఆ తర్వాత మార్వ్ తన ఓవర్ పూర్తి చేశాడు. మాట్ క్రిస్టియన్ షాట్‌ను ఆపే సమయంలో మార్వ్ వేలికి గాయమైంది.

వికెట్ తీసిన బౌలర్..

వైటాలిటీ బ్లాస్ట్ ఈ మ్యాచ్‌లో మార్వ్ డేనియల్ సామ్స్‌ను బౌల్డ్ చేశాడు. రాబిన్ దాస్ క్యాచ్ పట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ జట్టు 19.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. రాబిన్ ఎసెక్స్ నుంచి అత్యధికంగా 72 పరుగులు చేశాడు. 187 పరుగుల లక్ష్యాన్ని సోమర్‌సెట్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. టామ్ బాంథియోన్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..