IND vs SA: 10 వికెట్లతో స్నేహ్ రాణా సంచలనం.. ఏకైక టెస్టులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా

భారత అమ్మాయిలు అదరగొట్టారు. చెన్నైలోని ఎం చిదంబరం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్టులో భారత మహిళలు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.  భారత అమ్మాయిల ధాటికి  సోమవారం 232/2 (ఫాలోఆన్) రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 373 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది

IND vs SA: 10 వికెట్లతో స్నేహ్ రాణా సంచలనం.. ఏకైక టెస్టులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
Team India
Follow us

|

Updated on: Jul 01, 2024 | 5:46 PM

భారత అమ్మాయిలు అదరగొట్టారు. చెన్నైలోని ఎం చిదంబరం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్టులో భారత మహిళలు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.  భారత అమ్మాయిల ధాటికి  సోమవారం 232/2 (ఫాలోఆన్) రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 373 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ను టీమిండియా 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ 24 పరుగులు, శుభ సతీష్ 13 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు ఏకంగా 292 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్మృతి 161 బంతుల్లో 26 ఫోర్లు, 1 సిక్స్‌తో 149 పరుగులు చేసి ఔట్ కాగా, షఫాలీ వర్మ కూడా 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో 205 పరుగులు చేసింది. వీరిద్దరూ కాకుండా మిడిల్ ఆర్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్ 55 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 69 పరుగులు, రిచా ఘోష్ 86 పరుగులు చేశారు. తద్వారా భారత జట్టు 603/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా కేవలం 299 పరుగులకే ఆలౌటైంది. జట్టు తరఫున సునే లూస్ 65 పరుగులు, మరిజన్నే 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఫాలోఆన్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్రికన్ జట్టు 373 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్‌కు 37 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రికా సారథి లారా వోల్‌వార్డ్ 122 పరుగులు చేయగా, సునే లూస్ 109 పరుగులతో సెంచరీ, నాడిన్ డి క్లెర్క్ 61 పరుగులతో రాణించారు.

ఇవి కూడా చదవండి

భారత్ తరఫున బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన స్నేహ రాణా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించింది. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రాణించగలిగింది. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో స్నేహ, దీప్తి, రాజేశ్వరి చెరో 2 వికెట్లు తీయగా, పూజా, షఫాలీ, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్సుల్లోనూ 10 వికెట్లు తీసిన స్నేహ్ రాణాకు ప్లేయర ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

జైషా అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'టాప్' లేపేసిన టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్.. కోహ్లీ, రోహిత్ సంగతి
'టాప్' లేపేసిన టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్.. కోహ్లీ, రోహిత్ సంగతి
మాడిన నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయాలంటే సింపుల్ టిప్స్ మీ కోసం
మాడిన నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయాలంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఈ ఆకులను తక్కువ అంచానా వేయకండి.. ఖాళీ కడుపుతో రెండు తింటే..
ఈ ఆకులను తక్కువ అంచానా వేయకండి.. ఖాళీ కడుపుతో రెండు తింటే..
కర్ణాటక - ఆంధ్రా సరిహద్దులో తుపాకీ కాల్పుల కలకలం..!
కర్ణాటక - ఆంధ్రా సరిహద్దులో తుపాకీ కాల్పుల కలకలం..!
ఈ తప్పులు చేస్తే షుగర్‌‌ని అస్సలు కంట్రోల్ చేయలేం!
ఈ తప్పులు చేస్తే షుగర్‌‌ని అస్సలు కంట్రోల్ చేయలేం!
స్నేహితులతో గడపాలంటూ హీరోయిన్‏కు భర్త టార్చర్..
స్నేహితులతో గడపాలంటూ హీరోయిన్‏కు భర్త టార్చర్..
గత DSCకి దరఖాస్తు చేసుకున్నవారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు
గత DSCకి దరఖాస్తు చేసుకున్నవారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు
అంత్యక్రియలు ఆపేసి మరీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ..
అంత్యక్రియలు ఆపేసి మరీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ..
బరాత్‌ల పేరుతో హంగామా.. ఖాజీల కీలక నిర్ణయం..!
బరాత్‌ల పేరుతో హంగామా.. ఖాజీల కీలక నిర్ణయం..!
ఎప్పుడూ యవ్వనంగా మెరిసిపోవాలి అనుకుంటున్నారా.. ఇవి తినండి!
ఎప్పుడూ యవ్వనంగా మెరిసిపోవాలి అనుకుంటున్నారా.. ఇవి తినండి!