- Telugu News Photo Gallery Cricket photos These 4 Players Might Replace Virat Kohli, Rohit Sharma, Ravindra Jadeja In T20 Format
Team India: రోహిత్, కోహ్లీ స్థానాలు భర్తీ చేసేది వీరే.. లిస్టులో డబుల్ సెంచరీ ప్లేయర్
ఇక ఈ టోర్నీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరి స్థానాన్ని భర్తీ చేసేందుకు నలుగురు ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. మరి వారెవరో చూసేద్దాం..
Updated on: Jul 01, 2024 | 6:06 PM

బార్బోడాస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్‌లో సఫారీలను 7 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. సుమారు 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ ట్రోఫీని.. 17 ఏళ్ల తర్వాత ఐసీసీ టీ20 ట్రోఫీని చేజిక్కించుకుంది టీమిండియా.

ఇక ఈ టోర్నీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరి స్థానాన్ని భర్తీ చేసేందుకు నలుగురు ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. మరి వారెవరో చూసేద్దాం..

రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఓపెనర్‌గా దిగే ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. ఐపీఎల్‌లో 66 ఇన్నింగ్స్‌లు ఆడి 2380 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టీ20 ఫార్మాట్ విషయానికొస్తే.. 17 ఇన్నింగ్స్‌లలో 500 పరుగులు చేశాడు. అలాగే ఈ పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటిదాకా 3 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ చేశాడు.

శుభ్‌మాన్ గిల్.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన గిల్‌కు అంతర్జాతీయ కెరీర్‌లో అనుభవం ఉంది. 14 టీ20లు ఆడిన గిల్.. ఇప్పటిదాకా 335 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ ఉంది.

యశస్వి జైస్వాల్.. 16 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన జైస్వాల్.. మొత్తం 1 సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో 502 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దండిగా పరుగులు రాబట్టాడు.

శివమ్ దూబే.. ఇప్పటిదాకా 29 టీ20 మ్యాచ్‌లు ఆడి 409 పరుగులు చేశాడు దూబే.. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ శివమ్ దూబే టీంలో కీలక సభ్యుడిగా పరుగులు రాబట్టాడు. టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.




