అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బాల్ విసిరిన ప్రపంచ రికార్డు పాకిస్థాన్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2002లో, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అక్తర్ గంటకు 161.3 బౌలింగ్ చేసి ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. సుమారు 2 దశాబ్దాలు గడిచినా ఎవరూ ఈ రికార్డు ను అధిగమించలేకపోవడం గమనార్హం.