Video: డబుల్ సెంచరీ తర్వాత అది మర్చిపోయిన గిల్.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి సిరాజ్ సిగ్నల్ ఇవ్వడంతో..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన 269 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. అతని అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా 587 పరుగులు చేసింది. గిల్ తన సెలబ్రేషన్‌ను మర్చిపోవడం, సిరాజ్ గుర్తు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. అదే టెంపోను కొనసాగిస్తూ.. రెండో రోజు ఆటలో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 269 పరుగుల భారీ స్కోర్ చేసి.. తన జట్టుకు ఒక కెప్టెన్‌గా ఏం చేయాలో అది చేసి పెట్టాడు. గిల్ అద్భుత పోరాటంతో పాటు యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మంచి సపోర్ట్ అందించడంతో టీమిండియా 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే గిల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక విషయం మర్చిపోయాడు.. సిరాజ్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సిగ్నల్ ఇవ్వడంతో గిల్‌కు ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే..
సాధారణంగా గిల్ సెంచరీ చేస్తే.. ప్రత్యేకమైన శైలిలో హెల్మెట్ ముందుకు పెట్టి, బ్యాట్ వెనక్కి అంటూ కాస్త ముందుకు వంగి.. టేకే బౌ అన్నట్లు తన మార్క్ సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. కానీ, గురువారం ఆ స్టైల్ ఆఫ్ సెలబ్రేషన్స్ కాస్త లేట్ అయ్యాయి. డబుల్ సెంచరీ పూర్తి అయిందనే కంగారులో గిల్ తన మార్క్ సెలబ్రేషన్స్‌ను మర్చిపోయినట్లు ఉన్నాడు. ఈ సారి నేలపై మోకాలు ఆనిచ్చి.. హెల్మెట్ పైకెత్తుతూ.. వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ ఇంతలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి తన ఫ్రెండ్, టీమ్ మేట్ మొహమ్మద్ సిరాజ్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్‌ను గుర్తు చేశాడు. వెంటనే గిల్ కూడా తన మార్క్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇదంతా కెమెరా మెన్ కంటికి చిక్కింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆటలో టీమిండియా 587 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 269 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి రోజు ఆట తర్వాత గిల్‌కు జడేజా, వాషింగ్టన్ సుందర్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. జడేజా 89, సుందర్ 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే టీమిండియా ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆకాశ్ దీప్, సిరాజ్ గట్టి షాక్ ఇచ్చారు. ఆకాశ్ దీప్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది.
Come for Shubman Gill’s 200, stay for Mohammed Siraj’s bow at the end! 👏 pic.twitter.com/E0IISGQmHw
— Sky Sports Cricket (@SkyCricket) July 3, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి