Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నాతో తప్పుడు పనులు చేయించింది టీమిండియా ‘బావ’: రిషబ్ పంత్ సంచలన వ్యాఖ్యలు

Kapil Sharma Show: కపిల్ శర్మ షో ప్రోమో ప్రకారం టీమిండియా బావ ఎవరో తెలిపిపోయింది. ఇక రిషబ్ పంత్‌తో బలవంతంగా కొంతమంది ప్లేయర్లు తప్పుడు పనులు చేయించారంట. అది ఎవరనేది తెలియాలంటే కచ్చితంగా కపిల్ శర్మ షో ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Video: నాతో తప్పుడు పనులు చేయించింది టీమిండియా 'బావ': రిషబ్ పంత్ సంచలన వ్యాఖ్యలు
Rishabh Pant
Venkata Chari
|

Updated on: Jul 05, 2025 | 8:18 AM

Share

Kapil Sharma Show: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ పేసర్ మహ్మద్ షమీ, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ప్రస్తుతం భారత క్రికెట్‌ల్లో ఈ ముగ్గురి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కపిల్ శర్మ షోలో జరిగిన సరదా సంభాషణ, ఆ తర్వాత రిషబ్ పంత్ ఇటీవల తన ఆటతీరుపై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

కపిల్ శర్మ షోలో “టీమిండియా బావ”పై ఆసక్తికర చర్చ..!

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో” ప్రోమోలో గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, చాహల్, అభిషేక్ పాల్గొనడం విశేషం. ఈ ప్రోమోలో కపిల్ శర్మ, రిషబ్ పంత్‌ను “టీమిండియా బావ ఎవరు?” అని అడగ్గా, పంత్ తడుముకోకుండా మహ్మద్ షమీ పేరు చెప్పాడు. దీనికి గంభీర్ స్పందిస్తూ “గత 2 నెలలుగా అతను ఇంటికి రాలేదు” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ సంభాషణ షమీకి జట్టులో ఎంత ప్రత్యేక స్థానం ఉందో, ఆటగాళ్ల మధ్య ఎంత స్నేహపూర్వక వాతావరణం ఉందో తెలియజేస్తోంది. గతంలో షమీ తన వ్యక్తిగత విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టలేదని, క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాడని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

షమీ పునరాగమనంపై గంభీర్ అప్డేట్..

గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. షమీ గాయం నుంచి కోలుకొని తిరిగి లయను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమైనప్పటికీ, గంభీర్ షమీ ఫిట్‌నెస్ సాధించి తిరిగి జట్టులోకి వస్తాడని, ముఖ్యంగా కీలకమైన మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు గతంలోనే తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత బౌలర్లు అంతగా రాణించకపోవడంతో, షమీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

వాళ్లు నాతో తప్పుడు పనులు చేయిస్తారు: రిషబ్ పంత్..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. అయితే, రెండో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ దూకుడుగా ఆడి అనవసర షాట్‌తో వికెట్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పంత్‌కు తప్పుడు సంకేతాలు పంపి ఉండవచ్చని పరోక్షంగా ఆరోపించారు. పంత్ వంటి ఆటగాడితో ఎలా వ్యవహరించాలో గంభీర్ తెలుసుకోవాలని కార్తీక్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

కపిల్ శర్మ షో ప్రోమో ప్రకారం టీమిండియా బావ ఎవరో తెలిపిపోయింది. ఇక రిషబ్ పంత్‌తో బలవంతంగా కొంతమంది ప్లేయర్లు తప్పుడు పనులు చేయించారంట. అది ఎవరనేది తెలియాలంటే కచ్చితంగా కపిల్ శర్మ షో ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే టీమిండియా క్వీన్ ఎవరనేది కూడా అభిషేక్ శర్మ తెలిపాడు. కాగా, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఈ ఎపిసోడ్ జులై 5న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఆ షో ప్రసారం అవ్వగానే టీమిండియాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..