Shreyas Iyer: ఆర్‌సీబీ ఇంటికి చేరిన కోల్‌కతా మాజీ కెప్టెన్.. ఐపీఎల్‌కు దూరమైనా, లక్ష్యం విషయంలో తగ్గేదేలే..
మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న 16 సీజన్ టోర్నీ కప్‌పైనే అందరి దృష్టి ఉంది. అయితే కొందరు మాత్రం గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. వారిలో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ వహించిన శ్రేయాస్ అయ్యర్ కూడా..
టీమిండియాలోని చాలా మంది క్రికెటర్లు వచ్చే రెండు నెలల పాటు ఐపీఎల్ టోర్నీ కోసం తమ తమ జట్లలో చేరారు. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న 16 సీజన్ టోర్నీ కప్‌పైనే అందరి దృష్టి ఉంది. అయితే కొందరు మాత్రం గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. వారిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 15వ సీజన్‌లో కెప్టెన్సీ వహించిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఉన్నాడు. అయ్యర్ దూరం కావడంతో కోల్‌కతా టీమ్‌ను ఆ జట్టులోని యువ అటగాడు నితీష్ రాణా నడిపిస్తున్నాడు. అలాగే టోర్నీకి దూరమైన శ్రేయాస్.. నేరుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్థావరానికి చేరుకున్నాడు. అవును, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాల్గో టెస్టుకు వెన్నునొప్పి కారణంగా దూరమైన శ్రేయాస్ అయ్యర్.. చికిత్స కోసం బెంగళూరు చేరుకున్నాడు.
ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఫిట్‌గా ఉండాలని శ్రేయస్ కోరుకుంటున్నాడు. ఈ కారణంగానే శ్రేయాస్ నేరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)కి వెళ్లాడు. NCA లోని వైద్య బృందం పర్యవేక్షణలో తన లక్ష్యంపై పనిచేయనున్నాడు ఈ కోల్‌కతా టీమ్ ప్లేయర్. Cricbuzz తాజా నివేదిక ప్రకారం, భారత బ్యాట్స్‌మ్యాన్ శ్రేయాస్ అయ్యర్ మార్చి 29న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని ఎన్‌సీఏకి చేరాడు. అయితే ఈ నిర్ణయం ముందుగానే తీసుకున్నదని Cricbuzz తన నివేదికలో తెలిపింది. ఈ క్రమంలో శ్రేయాస్ ఈ రోజు అంటే మార్చి 30న తన వెన్నునొప్పి కోసం ఇంజెక్షన్ తీసుకుంటాడు. అలాగే అక్కడ ఎన్ని రోజులు పాటు ఉంటాడో పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని ఆ నివేదిక తెలిపింది.
మరోవైపవు వెన్నునొప్పి నుంచి కోలుకోవడానికి శ్రేయాస్ అయ్యర్.. NCAలోని అధికారులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్‌ని కూడా కలిశారని నివేదికలో వెల్లడైంది . ప్రస్తుతానికి సర్జరీ బాట పట్టబోనని, ఎన్‌సీఏలో ఉండి రీహాబిటేషన్ ద్వారా మళ్లీ ఫిట్‌నెస్ సాధించే ప్రయత్నం చేస్తానని శ్రేయాస్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో NCA అధికారులు కూడా అతనికి మద్దతుగా ఉన్నారు. సర్జరీ కారణంగా అతను చాలా నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండవలసి ఉంటుంది. అంతేకాక WTC ఫైనల్, ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో అతను ఆడడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో సర్జరీని నివారించవచ్చని అందరూ అనకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..