Arjun Tendulkar: ముంబై ప్లేయింగ్‌ XIలోకి సచిన్‌ తనయుడు..! రోహిత్ శర్మ, టీమ్ హెడ్ కోచ్ ఏమన్నారంటే..

ఐపీఎల్ 16వ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌కి ఆరంగేట్రం చేసేందుకు అవకాశ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బూమ్రా, ఆసీస్‌ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ ముంబైకి అందుబాటులో..

Arjun Tendulkar: ముంబై ప్లేయింగ్‌ XIలోకి సచిన్‌ తనయుడు..! రోహిత్ శర్మ, టీమ్ హెడ్ కోచ్ ఏమన్నారంటే..
Rohit Sharma On Arjun Tendulkar's Debut
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 30, 2023 | 8:37 AM

అర్జున్ టెండూల్కర్ గత రెండు సీజన్లలోనూ ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్నప్పటికీ, ఐపీఎల్ ఆరంగేట్రం చేయలేదు. ఒక సారి గాయాలతో, మరోసారి పరిస్థితులు అనుకూలించకపోవడంతో అతనికి అవకాశం లభించలేదు. అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌కి ఆరంగేట్రం చేసేందుకు అవకాశ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బూమ్రా, ఆసీస్‌ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ ముంబైకి అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో బౌలింగ్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు రోహిత్ సేనలో అర్జున్ చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా టోర్నీ ప్రారంభానికి ముందుగా అంటే బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అర్జున్ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్జున్ అరంగేట్రం గురించి ముంబై టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మను అడిగినప్పుడు, ఆ యువ క్రికెటర్‌ను నిరాశపరచని సమాధానం ఇచ్చాడు హిట్ మ్యాన్.

టీమ్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్‌తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ అర్జున్ గురించి మాట్లాడుతూ.. అతను తన బౌలింగ్‌తో చాలా మందిని ఆకట్టుకున్నాడని తెలిపాడు. ముంబై టీమ్‌లోకి వచ్చేందుకు అతను సిద్ధంగా ఉంటే, ఖచ్చితంగా ఎంపిక కోసం పరిశీలిస్తానని అన్నాడు. ‘అర్జున్ ఇప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడు. మ్యాచ్‌కి ముందు జరిగే ప్రాక్టీస్‌కి అతను రాబోతున్నాడు. మరి అందులో అతను ఏమి చేయగలడో చూద్దాం. గత 6 నెలలుగా బౌలింగ్ పరంగా అర్జున్ చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాడని నేను భావిస్తున్నాను. అందువల్ల అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే అవకాశం ఉంది. టీమ్‌లో ఆడే సామర్థ్యం అతనిలో కనపడితే, అతన్ని ఎంపిక కోసం అందుబాటులో ఉంచగులుగుతాం. అది మాకు చాలా మంచిది’ అని హెడ్ కోచ్ బౌచర్ అన్నారు.

మరోవైపు వన్డే ప్రపంచ కప్ ఈ ఏడాదే జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ సమయంలో రోహిత్‌కు కొన్ని ఆటల నుంచి విశ్రాంతి కల్పించే విషయంపై కూడా హెడ్ కోచ్ బౌచర్ మాట్లాడారు. ‘రోహిత్‌కు విశ్రాంతి విషయానికొస్తే, అతను టీమ్ కెప్టెన్. అతను విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ మేము పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామ’ని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..