AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2023: మావీ నుంచి ముఖేష్ వరకు.. అత్యధిక ధర పొందిన 5గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు..

శివమ్ మావీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మారాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఈ యువ ఫాస్ట్ బౌలర్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL Auction 2023: మావీ నుంచి ముఖేష్ వరకు.. అత్యధిక ధర పొందిన 5గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు..
Ipl 2023 Auction Uncapped Player Highest Bid Shivam Mavi N Jagadeesan
Venkata Chari
|

Updated on: Dec 23, 2022 | 7:34 PM

Share

ఐపీఎల్ వేలం 2023 కొచ్చిలో జరిగింది. ఈ వేలంలో సామ్ కరాన్, బెన్ స్టోక్స్, కెమరూన్ గ్రీన్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు భారీ మొత్తంలో దక్కించుకున్నారు. అదే సమయంలో భారతదేశానికి చెందిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిసింది. భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల గురించి మాట్లాడితే, శివమ్ మావి అత్యంత ఖరీదైనదినవాడిగా నిలిచాడు. శివమ్ మావీని హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ రూ.6 కోట్లకు దక్కించుకుంది. అంతకుముందు అతను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

శివమ్ మావీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్..

శివమ్ మామీ తర్వాత అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా ముఖేష్ కుమార్ నిలిచాడు. రూ. 5.50 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ముఖేష్ కుమార్‌ను కొనుగోలు చేసింది. ఈ జాబితాలో వివ్రాంత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. వివ్రాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, గుజరాత్ టైటాన్స్ కేఎస్ భరత్ ను రూ.1.20 కోట్లకు చేర్చుకుంది. అదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీలో ప్రభంజనం సృష్టించిన నారాయణ్ జగదీషన్‌కు ఆశించిన ధర లభించలేదు. నారాయణ్ జగదీషన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.

అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ వీరే..

శివమ్ మావీ, రూ. 6 కోట్లు (గుజరాత్ టైటాన్స్)

ఇవి కూడా చదవండి

ముఖేష్ కుమార్, రూ. 5.50 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

వివ్రాంత్ శర్మ, రూ. 2.60 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)

కేఎస్ భరత్, రూ. 1.20 కోట్లు (గుజరాత్ టైటాన్స్)

ఎన్ జగదీషన్, రూ. 90 లక్షలు (కోల్‌కతా నైట్ రిడర్స్ )

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కురాన్..

అదే సమయంలో, ఈ వేలంలో సామ్ కురాన్ అత్యంత ఖరీదైన వాడిగా మారాడు. పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు సామ్ కుర్రాన్‌ను కొనుగోలు చేసింది. కాగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్‌తో కామెరూన్ గ్రీన్ చేరాడు. కాగా, అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లండ్‌కు చెందిన బెన్‌స్టోక్స్‌ మూడో స్థానంలో నిలిచాడు. బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జాయింట్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్