అప్పుడేమో నేరుగా టీమిండియా టికెట్‌.. ఇప్పుడేమో 5.5 కోట్లతో ఐపీఎల్‌ ఎంట్రీ.. ముఖేష్‌ సుడి మాములుగా లేదుగా

బిహార్‌లో జన్మించి, బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ముఖేష్ కుమార్ IPL 2023 వేలంలో తన బేస్ ధర కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని పొందాడు . ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఫాస్ట్ బౌలర్ ను కొనుగోలు చేసింది.

అప్పుడేమో నేరుగా టీమిండియా టికెట్‌.. ఇప్పుడేమో 5.5 కోట్లతో ఐపీఎల్‌ ఎంట్రీ.. ముఖేష్‌ సుడి మాములుగా లేదుగా
Mukesh Kumar
Follow us

|

Updated on: Dec 23, 2022 | 7:32 PM

ఐపీఎల్‌ 2023 వేలంలో చాలా మంది క్రికెటర్ల పంట పండింది. ఆయా జట్ల తరఫున ఆడుతున్న విదేశీ క్రికెటర్లతో పాటు దేశవాళీ టోర్నీల్లోనూ అదరగొడుతోన్న ఆటగాళ్లు కూడా కోట్లు పలికారు. అందులో 29 ఏళ్ల టీమిండియా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కూడా ఒకరు. బిహార్‌లో జన్మించి, బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ముఖేష్ కుమార్ IPL 2023 వేలంలో తన బేస్ ధర కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని పొందాడు . ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఫాస్ట్ బౌలర్ ను కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ వేలంలో ముఖేష్ కుమార్ బేస్ ధర రూ. 20 లక్షలు కాగా ఢిల్లీ జట్టు ఏకంగా రూ.5.50 కోట్లకు అతనిని కొనుగోలు చేసింది. ముఖేష్‌కుమార్‌ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే అంతిమంగా ఢిల్లీ జట్టునే ఈ ఫాస్ట్‌ బౌలర్‌ను దక్కించుకుంది. కాగా గత కొన్ని నెలలుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్‌ ఆడకుండానే టీమ్‌ఇండియా టిక్కెట్‌ పొందిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ముఖేష్‌కుమార్‌ను టీమిండియాలోకి తీసుకున్నారు. శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియా ఆ సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా విన్నింగ్‌ ట్రోఫీని అందుకున్న ధావన్‌ మొదటగా దానిని జట్టులోకి కొత్తగా వచ్చిన ముఖేష్ కుమార్‌కు అందజేశాడు.

దేశవాళీ టోర్నీల్లో ..

28 ఏళ్ల ముఖేష్‌ కుమార్‌ 2015లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2016లో టీ20 క్రికెట్‌లోకి ప్రవేశించాడు. లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్‌.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీ20 క్రికెట్‌లో17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు. ఇక తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌ సిరీస్‌లో ముఖేష్‌ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్‌.. బెంగాల్‌ తరపున జాయింట్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి