AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India All Rounder: టీమిండియాకు నయా ఆల్ రౌండర్ దొరికేశాడోచ్.. ఏకంగా హార్దిక్ ప్లేస్‌కే చెక్ పెట్టేశాడుగా?

Shivam Dube, Hardik Pandya: హార్దిక్ పాండ్యా గాయంతో టీం ఇండియాకు దూరమైన తరుణంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు. భారత జట్టుకు ప్రధాన ఆల్‌రౌండర్, మొదటి ఎంపిక అయిన హార్దిక్ పాండ్యా 2023 వన్డే ప్రపంచ కప్‌లో గాయపడి ఇప్పటి వరకు పునరాగమనం చేయలేకపోయాడు.

Team India All Rounder: టీమిండియాకు నయా ఆల్ రౌండర్ దొరికేశాడోచ్.. ఏకంగా హార్దిక్ ప్లేస్‌కే చెక్ పెట్టేశాడుగా?
Shivam Dube, Hardik Pandya
Venkata Chari
|

Updated on: Jan 14, 2024 | 12:50 PM

Share

Shivam Dube, Hardik Pandya: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శివమ్ దూబే అద్భుత ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దూబే 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు, బౌలింగ్ చేస్తున్న సమయంలోనూ శివమ్ దూబే 1 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 2 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. శివమ్ దూబే ఈ ఆల్ రౌండ్ ప్రదర్శనతో నయా హార్దిక్ పాండ్యా భారత జట్టులోకి వచ్చాడంటూ అంతా భావిస్తున్నారు. దీంతో రాబోయే తరానికి హార్దిక్ ప్లేస్ ఆక్రమించేందుకు శివమ్ దూబే సిద్ధమవుతున్నాడంటూ మాజీలు కూడా చెబుతున్నారు.

కాగా, హార్దిక్ పాండ్యా గాయంతో టీం ఇండియాకు దూరమైన తరుణంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు. భారత జట్టుకు ప్రధాన ఆల్‌రౌండర్, మొదటి ఎంపిక అయిన హార్దిక్ పాండ్యా 2023 వన్డే ప్రపంచ కప్‌లో గాయపడి ఇప్పటి వరకు పునరాగమనం చేయలేకపోయాడు.

శివమ్ దూబే స్థానంలో హార్దిక్‌ని తీసుకోవడం సరైనదేనా?

హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా శివమ్ దూబేకి అవకాశం లభించింది. శివమ్ దూబే తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. శివమ్ దూబే ఐపీఎల్‌లో బాగా రాణిస్తే, అతను హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా మారగలడు. టీ20 ప్రపంచ కప్‌నకు కూడా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పటి వరకు శివమ్ దూబే కెరీర్ ఎలా ఉందంటే..

శివమ్ భారత్ తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతను ఇప్పటివరకు 1 వన్డే, 19 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఏకైక వన్డేలో, శివమ్ బ్యాటింగ్ చేస్తూ 9 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో విజయం సాధించలేకపోయాడు. ఇది కాకుండా, T20 అంతర్జాతీయ 12 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శివమ్ దూబే 35.33 సగటు, 139.47 స్ట్రైక్ రేట్‌తో 212 పరుగులు చేశాడు. ఈ కాలంలో, అతను 2 అర్ధ సెంచరీలు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 60* పరుగులు. T20Iలోని 17 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేస్తున్న సమయంలో 7 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..