AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: దేశవాళీలో కింగ్‌లు.. కట్‌చేస్తే.. బీసీసీఐ సెలెక్టర్లకు మాత్రం జీరోలు.. ఇక కెరీర్ ఖతమే.!

Indian Cricket Team:ఇంగ్లండ్‌తో టీమిండియా 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి, భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయని ఆటగాళ్లను ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs ENG: దేశవాళీలో కింగ్‌లు.. కట్‌చేస్తే.. బీసీసీఐ సెలెక్టర్లకు మాత్రం జీరోలు.. ఇక కెరీర్ ఖతమే.!
Ind Vs Eng Test
Venkata Chari
|

Updated on: Jan 14, 2024 | 1:31 PM

Share

IND vs ENG Test Series: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు జనవరి 25 నుంచి జరగనుంది. వాస్తవానికి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా భారత్-ఇంగ్లాండ్ సిరీస్ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. తాజాగా ఈ టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి, భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయని ఆటగాళ్లను ఇప్పుడు తెలుసుకుందాం..

1. సౌరభ్ కుమార్..

సౌరభ్ కుమార్ దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సౌరభ్ కుమార్ ఉత్తరప్రదేశ్ తరపున 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 280 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, అతను ఇండియా-ఎ జట్టులో భాగమయ్యాడు. కానీ, ఇప్పుడు అతనికి టీమిండియాకు ఆడే అవకాశం లేదు.

2. వాషింగ్టన్ సుందర్..

వాషింగ్టన్ సుందర్ టీమ్ ఇండియాలోకి వస్తూ వెళ్తున్నాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ టీమ్ ఇండియా తరపున 4 టెస్టులు మాత్రమే ఆడాడు. అందులో యాభై పరుగుల మార్క్ 3 సార్లు దాటాడు. బ్యాట్స్‌మన్‌గా, ఈ ఆటగాడు టెస్ట్ ఫార్మాట్‌లో 66 సగటుతో పరుగులు చేశాడు. కానీ, ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక కాలేదు.

3. అభిమన్యు ఈశ్వరన్..

బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అభిమన్యు ఈశ్వరన్‌ను చాలాసార్లు టీమ్ ఇండియాలోకి వచ్చాడు. కానీ, ఇప్పుడు అతనికి భారత్‌ తరపున ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. అభిమన్యు ఈశ్వరన్ 89 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 47 సగటుతో పరుగులు చేశాడు.

4. సర్ఫరాజ్ ఖాన్..

ఈ జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా చేరింది. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం పరుగులు చేస్తున్నాడు. కానీ, ఇప్పటివరకు అతను టీమ్ ఇండియాలో భాగం కాలేకపోయాడు. నిజానికి, శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో నిరంతరం కష్టపడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాలో భాగం చేయవచ్చు. కానీ, సెలెక్టెర్లు మాత్రం కరుణ చూపడంలేదు.

5. రజత్ పాటిదార్..

రజత్ పాటీదార్ దేశీయ రికార్డు అద్భుతంగా ఉంది. రజత్ పాటిదార్ 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45 సగటుతో 3845 పరుగులు చేశాడు. ఈ ఆటగాడి పేరిట 11 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి. కానీ రజత్ పాటిదార్ భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక కాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!