On This Day: 9వ స్థానంలో బ్యాటింగ్.. అత్యధిక సెంచరీలతో అరుదైన రికార్డ్.. కట్‌చేస్తే.. లెక్కల తేడాతో కెప్టెన్సీకి గుడ్‌బై..
Shaun Pollock Birthday: దక్షిణాఫ్రికా గ్రేట్ ఆల్ రౌండర్ షాన్ పొలాక్.. ఈరోజు 50వ ఏట అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఎన్నో చెరగని రికార్డులు అతని పేరు మీద ఉన్నాయి.

Shaun Pollock Birthday: లెక్కింపులో చిన్న పొరపాటు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విషయం దక్షిణాఫ్రికా జట్టు కంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు. తప్పుడు లెక్కల కారణంగా జట్టు మొత్తం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ సంగతి దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్ నాటిది. ఆ ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు అప్పటికే తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. వెస్టిండీస్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి అత్యంత ఘోరమైనది. 20 ఏళ్ల తర్వాత కూడా దక్షిణాఫ్రికా అభిమానులెవరూ మర్చిపోలేని ఓటమి ఇది.
నిజానికి వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా సులువుగా గెలిచినట్లు అనిపించింది. కానీ, వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ నియమం అమలులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ షాన్ పొలాక్ డక్‌వర్త్ స్కోరును తప్పుగా లెక్కించి, తదనుగుణంగా పరుగులు చేశాడు. దాని కారణంగా సౌతాఫ్రికా టీం తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. కౌంటింగ్ తప్పిదం కారణంగా, దక్షిణాఫ్రికా గెలిచిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆ జట్టు టోర్నీ నుంచి కూడా నిష్క్రమించింది. దీని తర్వాత పొలాక్ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.




నిద్రలోనే జట్టు..
పొలాక్ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. కానీ, ప్రపంచ కప్‌లో అతను చేసిన తప్పుడు లెక్కలు అతనికి అంతులేని గాయాన్ని మిగిల్చాయి. అతని పొరపాటు జట్టు మొత్తానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాయి. పొలాక్ కూడా ఈ నొప్పి నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. ఆ తర్వాత మరో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2008లో తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 9వ స్థానంలో బరిలోకి దిగి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ పొలాక్.. ఈరోజు 50వ ఏట అడుగుపెట్టాడు.
9వ స్థానంలో అత్యధిక సెంచరీలు..
View this post on Instagram
16 జులై 1973న జన్మించిన పొలాక్ కుటుంబం మొత్తం క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉంది. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ పొలాక్ 1995 నుంచి 2008 మధ్య దక్షిణాఫ్రికా తరపున 108 టెస్ట్ మ్యాచ్‌లలో 3781 పరుగులు, 421 వికెట్లు తీశాడు. 303 వన్డేల్లో 3519 పరుగులు చేసి 393 వికెట్లు తీశాడు. అతను దక్షిణాఫ్రికా తరపున 12 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. అందులో అతను 86 పరుగులు చేసి 15 వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 9వ స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును పొలాక్ కలిగి ఉన్నాడు. అది నేటికీ అలాగే ఉంది. అతను 9వ స్థానంలో బరిలోకి దిగి 2 సెంచరీలు కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




