Virat Kohli: విరాట్ @ 500.. విండీస్‌తో రెండో టెస్టులో కింగ్ కోహ్లీ స్పెషల్ రికార్డ్.. లిస్టులో ఎవరున్నారంటే?
IND vs WI 2nd Test: భారత్, వెస్టిండీస్ మధ్య జులై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.

Virat Kohli: టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో జులై 20 ఓ స్పెషల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇప్పటివరకు కోహ్లీ 499 మ్యాచ్‌లు ఆడాడు. విండీస్‌తో జరిగే 2వ టెస్ట్‌తో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన 2వ ప్లేయర్‌గా నిలిచాడు.
జులై 20 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో 2వ టెస్టు మ్యాచ్ జరగనుంది. కరేబీయన్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో కోహ్లి సూపర్ ఫాంలో ఉన్నట్లే కనిపించాడు. బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ 182 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. టీమిండియా తరపున 3 ఫార్మాట్లలో కలిపి 100కుపైగా మ్యాచ్‌లు ఆడాడు.
ఆగస్టు 2008లో లంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ ఎంట్రీ ఇచ్చాడు. కింగ్ కోహ్లీ తన కెరీర్‌లో 274 వన్డేలు, 110 టెస్టులు, 115 టీ20ఐల్లో ఆడాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో 48.88 సగటుతో 8555 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 57.32 సగటుతో 12,898 పరుగులు బాదేశాడు. ఇక పొట్టి క్రికెట్‌లో 52.73 సగటు, 137.96 స్ట్రైక్ రేట్‌తో 4008 రన్స్ కొట్టేశాడు. అలాగే భారత ఛేజింగ్ మాస్టర్ కోహ్లి 3 ఫార్మాట్లలో శతకాలు కొట్టేశాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 75 అంతర్జాతీయ సెంచరీలు బాదేశాడు. అలాగే 131 అర్ధ సెంచరీలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 245 నాటౌట్‌తో కెరీర్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.




500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు..
అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ 500 మ్యాచ్‌లు ఆడనున్న 10వ ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ లిస్టులో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్‌లో 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టాప్ 10 ప్లేయర్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు)
మహేల జయవర్ధనే (652 మ్యాచ్‌లు)
కుమార సంగక్కర (594 మ్యాచ్‌లు)
సనత్ జయసూర్య (586 మ్యాచ్‌లు)
రికీ పాంటింగ్ (560 మ్యాచ్‌లు)
మహేంద్ర సింగ్ ధోనీ (538 మ్యాచ్‌లు)
షాహిద్ అఫ్రిది (524 మ్యాచ్‌లు)
జాక్వెస్ కల్లిస్ (519 మ్యాచ్‌లు)
రాహుల్ ద్రవిడ్ (509 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ (499 మ్యాచ్‌లు)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




