AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: కెరీర్ క్లోజ్ అనుకున్న టైంలో.. 22 ఏళ్ల క్రికెటర్‌కు ‘బిగ్ లైఫ్’ ఇచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?

Indian Cricketer: డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా జరిగిన సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఆసియా గేమ్స్ 2023కు బీసీసీఐ టీంను ప్రకటించింది. అయితే, ఓ ఆటగాడి కెరీర్ ముగిసిందని భావించిన ఓ ఆటగాడి కెరీర్‌కు బీసీసీఐ 'లైఫ్' ఇచ్చింది.

Team India: కెరీర్ క్లోజ్ అనుకున్న టైంలో.. 22 ఏళ్ల క్రికెటర్‌కు 'బిగ్ లైఫ్' ఇచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?
Ravi Bishnoi
Venkata Chari
|

Updated on: Jul 16, 2023 | 11:13 AM

Share

Indian Cricket Team for Asian Games 2023: భారత జట్టు ప్రస్తుతం ఓపెనర్ రోహిత్ శర్మ నేతృత్వంలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా జరిగిన సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఆసియా గేమ్స్ 2023కు బీసీసీఐ టీంను ప్రకటించింది. అయితే, ఓ ఆటగాడి కెరీర్ ముగిసిందని భావించిన ఓ ఆటగాడి కెరీర్‌కు బీసీసీఐ ‘లైఫ్’ ఇచ్చింది.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) రాబోయే 19వ ఆసియా క్రీడల (Asian Games-2023) కోసం భారత పురుషుల క్రికెట్ జట్టును శుక్రవారం అర్థరాత్రి ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు 26 ఏళ్ల బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు. అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్, కేకేఆర్ ‘సిక్సర్ కింగ్’ రింకు సింగ్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లతో సహా జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.

ఈ బౌలర్ కెరీర్‌కు బిగ్ ‘లైఫ్’..

కాగా, అవకాశం కోసం తహతహలాడుతున్న ఓ ఆటగాడి కెరీర్‌కు బీసీసీఐ ‘లైఫ్‌లైన్’ ఇచ్చింది. అతను మరెవరో కాదు 22 ఏళ్ల స్పిన్నర్ రవి బిష్ణోయ్. ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టులో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కింది. రవి ఇప్పుడు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఆసియా గేమ్స్‌లో క్రికెట్ ఈవెంట్‌లు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన రవి బిష్ణోయ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక వన్డే, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను గత 9 నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. గతేడాది ఆడిన ఆసియా కప్‌లో జట్టులోకి వచ్చాడు. అంతే కాదు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా ఆడిన బిష్ణోయ్.. ఆ తర్వాత జట్టు నుంచి తప్పుకున్నాడు. లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియా నుంచి దూరంగా ఉన్నాడు.

ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు: రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే.

స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి కిషోర్, సాయి సుదర్శన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..