Video: చివరి ఓవర్లో విజయానికి 6 పరుగులు.. తొలి బంతికి ఫోర్.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్‌తో టెన్షన్ పెంచిన బౌలర్..
BAN vs AFG: చివరి ఓవర్లో బంగ్లాదేశ్ జట్టు విజయానికి 6 పరుగులు కావాలి. మొదటి బంతికి ఫోర్ కొట్టారు. ఆ తర్వాత మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరుకుంది.

Bangladesh and Afghanistan, 2nd T20 Match: బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా ముగిసింది. సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ చివరి ఓవర్‌లో 1 బంతి మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 6 పరుగులు అవసరం కాగా, అఫ్గానిస్థాన్ బౌలర్ కరీం జనత్ హ్యాట్రిక్ సాధించి ఒక్కసారిగా మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు.
సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మహ్మద్ నబీ 54 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో కెప్టెన్ షకీబ్ 2 వికెట్లు తీశాడు.




లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి చివరి ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేయడానికి వచ్చిన కరీం జనత్ వేసిన తొలి బంతికే మెహదీ హసన్ మిరాజ్ ఫోర్ కొట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు.
1 బాల్ మిగిలి ఉండగానే..
This over had more drama than a daily soap 🎢 pic.twitter.com/jxM2zt1CfP
— FanCode (@FanCode) July 14, 2023
చివరి ఓవర్ తొలి బంతిని ఫోర్ బాదిన బంగ్లాదేశ్ తర్వాతి 5 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత కరీం జనత్ రెండో బంతికే మెహదీ హసన్ వికెట్ తీశాడు. మూడో బంతికి కరీమ్ తస్కిన్ అహ్మద్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని ఎదుర్కొన్న నసుమ్ అహ్మద్ కూడా క్యాచ్ ఔట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పుడు చివరి 2 బంతుల్లో బంగ్లాదేశ్ విజయానికి 2 పరుగులు కావాలి. దీని తర్వాత బ్యాటింగ్‌కు దిగిన షోరిఫుల్ ఇస్లాం కట్ షాట్‌లో ఫోర్‌తో ఈ మ్యాచ్‌లో జట్టుకు 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
