AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: గుడ్‌న్యూస్.. రోజుకు 10 ఓవర్లు బౌలింగ్.. రీఎంట్రీ కోసం చెమటలు పట్టిస్తోన్న భారత్ స్టార్ ప్లేయర్..

Jasprit Bumrah Fitness: వెన్నునొప్పి కారణంగా గత ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు.

Team India: గుడ్‌న్యూస్.. రోజుకు 10 ఓవర్లు బౌలింగ్.. రీఎంట్రీ కోసం చెమటలు పట్టిస్తోన్న భారత్ స్టార్ ప్లేయర్..
Jasprit Bumrah Fitness
Venkata Chari
|

Updated on: Jul 16, 2023 | 1:02 PM

Share

వెన్నునొప్పి కారణంగా గత ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సెప్టెంబర్ 2022 నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా, గత ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి ప్రధాన టోర్నమెంట్‌లకు దూరమయ్యాడు. కాగా, కొన్ని నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. మెల్లగా ఫిట్‌గా మారుతున్న బుమ్రా.. కొద్ది రోజుల క్రితం బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. గతంలో బుమ్రా ప్రతిరోజూ 6 నుంచి 7 ఓవర్లు బౌలింగ్ చేసేవాడు.

ఇప్పుడు ఇంగ్లీష్ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచారం మేరకు, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎటువంటి సమస్యను ఎదుర్కోవడంలేదు. అందుకే శరవేగంగా బౌలింగ్ చేయడం ప్రారంభించాడని చెబుతున్నారు. అంతేకాదు రోజుకు 8 నుంచి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటున్న బుమ్రా.. ఆసియా కప్‌నకు ముందు వచ్చే నెలలో ఐర్లాండ్‌లో జరిగే పర్యటనలో జట్టులోకి రావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఈ టూర్‌లో భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇటువంటి పరిస్థితిలో ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌నుకు ముందు, బుమ్రా మ్యాచ్ ఫిట్‌నెస్, అతని లయను తిరిగి పొందే అవకాశం ఉంది.

ఒకవేళ బుమ్రా ఐర్లాండ్‌ టూర్‌లో ఆడితే.. పూర్తి ఫిట్‌నెస్‌తో ఆసియాకప్‌ ఆడగలిగితే.. అది టీమిండియాకు పెద్ద రిలీఫ్‌. ఎందుకంటే అక్టోబర్ 5 నుంచి భారత్ లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు కొండంత బలం వచ్చినట్లుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..