WTC Points Table: WTC పాయింట్ల పట్టికలో సత్తా చాటిన రోహిత్ సేన.. ఆసీస్‌ను వెనక్కునెట్టిన భారత్..
WTC 2025: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌ను ప్రారంభించింది. డొమినికాలో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి, WTC పాయింట్ల పట్టికలో రోహిత్ సేన సత్తా చాటింది.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌ను ప్రారంభించింది. డొమినికాలో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి, WTC పాయింట్ల పట్టికలో రోహిత్ సేన సత్తా చాటింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 మూడో ఎడిషన్‌లో, ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను అధిగమించి నెం.1 స్థానానికి చేరుకోవడంలో టీమిండియా విజయం సాధించింది. వెస్టిండీస్‌పై విజయంతో, భారత్ 12 పాయింట్లు సేకరించి, 100 శాతం విజయంతో కొత్త పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
భారత్ తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా 22 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌ల తర్వాత కంగారూల విజయ శాతం 61.11గా మారింది.
అంతకుముందు సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. హెడింగ్లీ టెస్టులో ఓడిపోయింది. అలాగే ICC మొదటి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల ఖాతాలో రెండు పాయింట్లు తగ్గాయి.
దీంతో ఇంగ్లండ్ మైనస్ రెండు పాయింట్లతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే చివరి మ్యాచ్‌లో విజయం సాధించి 10 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
2021 WTC ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్, ఆ తర్వాత గత నెలలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 209 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు తమ ప్రచారాన్ని పరిపూర్ణ విజయంతో ప్రారంభించింది. అలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఇదిలా ఉంటే, 2023లో టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియా తన తదుపరి టెస్టు సిరీస్‌ని డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత 2024 జనవరి-ఫిబ్రవరిలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..