నా నిర్ణయం సరైనదే: పాక్ కెప్టెన్

భారత్‌తో జరిగిన హైటెన్షన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బౌలింగ్ ఎంచుకోవడం విమర్శలకు దారి తీసింది. స్వయంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ సూచనలను సైతం పక్కనపెట్టి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. మ్యాచ్ అనంతరం ఈ విమర్శలకు సర్ఫరాజ్ బదులిచ్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తన నిర్ణయం సరైనదేనని, దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. పిచ్‌పై […]

నా నిర్ణయం సరైనదే: పాక్ కెప్టెన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 17, 2019 | 7:07 PM

భారత్‌తో జరిగిన హైటెన్షన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బౌలింగ్ ఎంచుకోవడం విమర్శలకు దారి తీసింది. స్వయంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ సూచనలను సైతం పక్కనపెట్టి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. మ్యాచ్ అనంతరం ఈ విమర్శలకు సర్ఫరాజ్ బదులిచ్చాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తన నిర్ణయం సరైనదేనని, దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. పిచ్‌పై కొద్దిగా తేమ ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలనే బౌలింగ్ ఎంచుకున్నట్టు చెప్పాడు. అయితే, ఆ అవకాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. బంతిని సరిగ్గా సంధించడంలో బౌలర్లు విఫలమయ్యారన్నాడు. తమ జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ పూర్తిగా విఫలమైందన్నాడు.