ఇంగ్లాండ్‌కు డబుల్ షాక్!

ప్రపంచకప్ ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు డబుల్ షాక్ తగిలింది. ఓపెనర్ జాసన్ రాయ్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వారం రోజుల పాటు జట్టుకు దూరమవుతున్నారు. ఇటీవల విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడంతో జాసన్ రాయ్ మైదానాన్ని వీడాడు. గాయాన్ని పరీక్షించిన డాక్టర్లు.. తొడ కండరాల్లో చీలికలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో రాయ్‌కు రెండు మ్యాచ్‌లు రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. అలాగే అదే మ్యాచ్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా వెన్నునొప్పితో […]

ఇంగ్లాండ్‌కు డబుల్ షాక్!
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2019 | 3:27 PM

ప్రపంచకప్ ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు డబుల్ షాక్ తగిలింది. ఓపెనర్ జాసన్ రాయ్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వారం రోజుల పాటు జట్టుకు దూరమవుతున్నారు. ఇటీవల విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడంతో జాసన్ రాయ్ మైదానాన్ని వీడాడు. గాయాన్ని పరీక్షించిన డాక్టర్లు.. తొడ కండరాల్లో చీలికలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో రాయ్‌కు రెండు మ్యాచ్‌లు రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది.

అలాగే అదే మ్యాచ్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా వెన్నునొప్పితో మధ్యలోనే వెనుదిరిగాడు. నొప్పి మరింత ఎక్కువయ్యేసరికి మోర్గాన్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఇకపోతే శుక్రవారం లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు మోర్గాన్ ఫిట్‌గా ఉంటాడని బోర్డు భావిస్తోంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్.. మూడు మ్యాచ్‌లు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.