AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ కప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ విజయ పరంపర‌

దశాబ్దాలుగా సాగుతున్న అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తూ, కోట్లాదిమంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. త్రివర్ణం సగర్వంగా, సమున్నతంగా నిలిచేలా.. టీమిండియా అద్భుత ఆటతీరుతో మురిపించింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ అనేదే లేకుండా చేతులెత్తేశారు. ఇక‌ క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్లుగా ప్రస్థుత ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ నుంచి అమీర్ సోహైల్, వాసిం అక్రమ్, వకార్ యూన‌స్, షాహిద్ ఆఫ్రిది, మిస్బా ఉల్ హక్, సర్పరాజ్ అహ్మద్ ల దాకా ఎవరున్నా ప్రపంచ క్రికెట్ కప్ […]

వరల్డ్ కప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ విజయ పరంపర‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 17, 2019 | 4:49 PM

Share

దశాబ్దాలుగా సాగుతున్న అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తూ, కోట్లాదిమంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. త్రివర్ణం సగర్వంగా, సమున్నతంగా నిలిచేలా.. టీమిండియా అద్భుత ఆటతీరుతో మురిపించింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ అనేదే లేకుండా చేతులెత్తేశారు.

ఇక‌ క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్లుగా ప్రస్థుత ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ నుంచి అమీర్ సోహైల్, వాసిం అక్రమ్, వకార్ యూన‌స్, షాహిద్ ఆఫ్రిది, మిస్బా ఉల్ హక్, సర్పరాజ్ అహ్మద్ ల దాకా ఎవరున్నా ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో భారతజట్టు చేతిలో పరాజయమే ఎదురైంది. 1992 నుంచి నేటి వరకు ఏడుసార్లు టీమిండియా పాక్ జట్టుపై విజయ దుందుభి మోగించి భారత క్రికెట్ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. మొదటి మూడు వరల్డ్ కప్ పోటీల్లో సచిన్ టెండూల్కర్ పాక్ జట్టుపై అత్యధిక పరుగులు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.

  • 1992లో సిడ్నీలో జరిగిన క్రికెట్ పోటీల్లో పాక్ జట్టుపై భారత క్రికెట్ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • 1996 మార్చి 9వతేదీన బెంగళూరులో జరిగిన పోటీలో 39 పరుగుల తేడాతో పాక్ ను టీమిండియా చిత్తు చేసింది.
  • 1999 జూన్ 8వతేదీన ఓల్డ్ ట్రాఫార్డ్ లో భారత జట్టు పాక్ పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • 2003 మార్చి 1న సెంచూరియన్ లో జరిగిన పోటీలో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • 2011 మార్చి 30వతేదీన మొహాలీలో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
  • 2015 ఫిబ్రవరి 15వతేదీన అడిలాయిడ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ పాక్ జట్టుపై 76 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.
  • 2019 జూన్ 16న‌ ఏడోసారి మళ్లీ పాక్ జట్టును చిత్తు చేస్తూ 89 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

Follow Us
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..