AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarfaraz Khan: సర్ఫరాజ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్..

Sarfaraz Khan New Thar: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఇచ్చిన మాటను ఆనంద్ మహీంద్రా నిలబెట్టుకున్నారు. ఆయన తండ్రి నౌషాద్ ఖాన్ సమక్షంలో సర్ఫరాజ్‌కి కూల్ SUV THARను బహుమతిగా అందించారు.

Sarfaraz Khan: సర్ఫరాజ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్..
Anand Mahindra gifted Thar to Sarfaraz Khan
Venkata Chari
|

Updated on: Mar 23, 2024 | 6:35 AM

Share

Sarfaraz Khan New Thar: ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. భారత ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా యజమాని ఆనంద్ మహీంద్రా శుక్రవారం నాడు సర్ఫరాజ్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఆనంద్ మహీంద్రా తన తండ్రి నౌషాద్ ఖాన్, సోదరుడు ముషీర్ ఖాన్ సమక్షంలో మహీంద్రా శక్తివంతమైన SUV THARను సర్ఫరాజ్‌కు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఆనంద్ మహీంద్రా చాలా మంది క్రికెట్ ఆటగాళ్లకు థార్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 15న ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అరంగేట్రంలో తండ్రి నౌషాద్ ఖాన్, భార్య కూడా ఉన్నారు. కొడుకు అరంగేట్రంపై తండ్రి నౌషాద్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

సర్ఫరాజ్‌కు థార్‌ను బహుమతిగా ఇచ్చిన ఆనంద్ మహీంద్రా..

ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నాడు. సర్ఫరాజ్ అరంగేట్రం జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 16న అతను Xలో పోస్ట్ చేశాడు. ఇందులో ధైర్యాన్ని కోల్పోవద్దు, కష్టపడి పనిచేయండి, ధైర్యం, సహనం అని మహీంద్రా రాసుకొచ్చారు. పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు తండ్రికి ఇంతకంటే మంచి గుణం ఏముంటుంది? స్పూర్తిదాయకమైన తల్లిదండ్రులుగా, నౌషాద్ ఖాన్ థార్‌ని బహుమతిగా స్వీకరిస్తే అది నా సంతోషం, గౌరవం అంటూ తెలిపాడు.

సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు ఆడాడు. ఇందులో అతను 500 సగటుతో 200 పరుగులు చేశాడు. మొత్తం సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..