Sanju samson: ఇదేందిది.. ఆ మాజీ ప్లేయర్ కారణంగా రాజస్థాన్ ను వీడనున్న శాంసన్..?
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా బ్యాడ్ లక్ ప్లేయర్ సంజు శాంసన్ ట్రేడ్ చేసుకోవడానికి చర్చలు ప్రారంభించింది. ఇంతలో, ఒక ఆటగాడిని తప్పించిన కారణంగా శాంసన్ రాజస్థాన్‌ను విడిచిపెట్టాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్ 2025లో సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వివాదం చోటుచేసుకుంది. తాజాగా ఈ వార్త బయటకు వస్తోంది. ఈ విషయం చిలికి, చిలికి గాలివానలా మారింది. సంజు శాంసన్ ఇకపై రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉండకూడదనుకుంటున్నాడు. అంతే కాదు, రాజస్థాన్ జట్టు కూడా అతనిని ట్రేడ్ చేయడానికి చర్చలు ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్ సహా మరికొన్ని జట్లతో శాంసన్ ను ట్రేడ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, సంజు సామ్సన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి విడిపోవాలని కోరుకునేలా ఏమి జరిగిందనేది. నివేదికల ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ తొలగించిన ఆటగాడే దీనికి పెద్ద కారణమని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సంజు శాంసన్ జీర్ణించుకోలేకపోతున్నాడంట.
బట్లర్ నిష్క్రమణతో శాంసన్ విచారం..
12 సంవత్సరాలుగా రాజస్థాన్ రాయల్స్‌తో అనుబంధం ఉన్న శాంసన్ కు రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యంతో అనేక అంశాలపై విభేదాలు ఉన్నాయి. కానీ జోస్ బట్లర్‌ను జట్టు నుంచి విడుదల చేయడం ఒక ప్రధాన కారణం. నివేదికల ప్రకారం,శాంసన్ ఈ నిర్ణయాన్ని అస్సలు ఇష్టపడలేదు. అతను దానితో ఏకీభవించలేదు. గత ఐపీఎల్ సీజన్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంసన్ దీని గురించి బహిరంగంగా మాట్లాడాడు. ‘బట్లర్ నిష్క్రమణ నాకు అత్యంత కష్టమైన నిర్ణయాలలో ఒకటి. ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో, నేను ఇంకా ఈ నిర్ణయం నుంచి కోలుకోలేదని ఓ సందర్భంలో తెలిపాడు. నేను ఐపీఎల్‌లో ఒక విషయం మార్చగలిగితే, ప్రతి మూడు సంవత్సరాలకు ఆటగాళ్లను విడుదల చేయడం నియమం అవుతుంది’ అని అన్నారు.
బట్లర్ స్థానంలో హెట్మెయర్..
రాజస్థాన్ రాయల్స్ బట్లర్ కు బదులుగా షిమ్రాన్ హెట్మైర్ ను నిలుపుకోవాలని నిర్ణయించుకుంది. ఇది శాంసన్ ను మరింత నిరాశపరిచింది. ఇది కాకుండా, శాంసన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. అయితే, ద్రవిడ్ ఈ నివేదికలను తోసిపుచ్చాడు, అలాంటిదేమీ లేదని చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




