AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే చెన్నై టీంను వదిలేసుడే..!

CSK Captaincy: ఐపీఎల్ 2027కి ముందు సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు రెండు భారీ డిమాండ్లు పెట్టారు: కెప్టెన్సీ, జట్టు ఎంపికలో పూర్తి అధికారం. రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన చేసినా కెప్టెన్‌గా కొనసాగాలని CSK నిర్ణయించడంతో సంజు అసంతృప్తిగా ఉన్నాడు. డిమాండ్లు నెరవేరకపోతే ట్రేడ్ ద్వారా CSKను వీడతానని సంజు హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ అతనితో చర్చలు జరుపుతోంది.

IPL 2027: ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే చెన్నై టీంను వదిలేసుడే..!
Sanju Samson Csk Captaincy
Venkata Chari
|

Updated on: Aug 25, 2026 | 6:59 PM

Share

CSK Captaincy: సంజు శాంసన్ ఐపీఎల్ 2027 సీజన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు కెప్టెన్సీ అవకాశం లభించకపోవడమే దీనికి కారణమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ కు కెప్టెన్సీ దక్కలేదు. అయినప్పటికీ, అతను ఒక ఆటగాడిగా అద్భుతంగా రాణించి, 13 ఇన్నింగ్స్‌లలో 47.70 సగటు, 166.20 స్ట్రైక్ రేట్‌తో 477 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే

కాగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లలో 28.08 సగటు, 123.44 స్ట్రైక్ రేట్‌తో 337 పరుగులు చేశాడు. ఈ స్ట్రైక్ రేట్ చాలా పేలవమైనదిగా నిరూపితమైంది. అంటే, ఈ స్ట్రైక్ రేట్‌తో ఆడితే 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయవచ్చని సెటైర్లు వినిపిస్తున్నాయి. రుతురాజ్ ఇంత పేలవంగా ఆడడడంతో, ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందే చెన్నై కెప్టెన్సీలో మార్పు ఉంటుందని వార్తలు వ్యాపిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితిలో, IPL 2027 సీజన్‌కు కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కొనసాగుతాడని CSK యాజమాన్యం నిర్ణయించింది. కొత్త కోచ్ ఎంపికలో రుతురాజ్ సలహా తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారంట.

ఇలాంటి పరిస్థితిలో, IPL 2027 సీజన్‌లో తనకు కెప్టెన్సీ లభించదని తెలుసుకున్న సంజు శాంసన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, అతను ట్రేడింగ్‌లో జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని, ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కూడా అతనితో చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి.

ఈక్రమంలో సంజు శాంసన్ ను శాంతింపజేయడానికి సీఎస్‌కే యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ శాంసన్ తన డిమాండ్‌పై పట్టుదలతో ఉన్నాడంట.

ఐపీఎల్ 2027 సీజన్‌లో తనకు కెప్టెన్సీ ఇవ్వకపోతే సీఎస్‌కేలో కొనసాగలేనని అతను యాజమాన్యానికి స్పష్టంగా చెప్పాడని అంటున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి ముందుకు రావడంతో శాంసన్ సీఎస్‌కేతో కఠినంగా మాట్లాడని నివేదికలు చెబుతున్నాయి.

ఎక్కువమంది చదివినది: Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

అంతేకాకుండా, కేవలం కెప్టెన్సీ మాత్రమే కాకుండా, బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌ను నిర్ణయించే పూర్తి బాధ్యతను కూడా తనకు ఇవ్వాలని శాంసన్ మరో డిమాండ్ చేసినట్లు సమాచారం. గత సీజన్‌లో తను కెప్టెన్‌గా ఉండి ఉంటే, జట్టును సరిగ్గా నిర్మించి ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో, తప్పులను ఎత్తిచూపే హక్కు కూడా తనకు ఇవ్వలేదని వాపోయాడంట. ఇటువంటి పరిస్థితిలో, కెప్టెన్సీ లేకుండా తాను ఆడలేనని శాంసన్ స్పష్టంగా చెప్పాడని అంటున్నారు.

అదే సమయంలో, రుద్రాజ్ గైక్వాడ్‌కు కూడా కెప్టెన్సీ కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌లో సీఎస్‌కేను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్తానని గైక్వాడ్ యాజమాన్యానికి స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎస్‌కే యాజమాన్యం తీవ్ర గందరగోళంలో పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us