ప్రపంచకప్‌లో భారత్ ఓటమి.. కోచ్‌పై తొలి వేటు..?

ఈ సారి ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది టీమిండియా. లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మినహాయించి.. మిగిలిన అన్ని జట్లపైనా విజయం సాధిస్తూ పట్టికలో టాప్‌ ప్లేస్‌ను సాధించిన భారత్.. సెమీ ఫైనల్‌లో 18పరుగుల తేడాతో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. అయితే ఈ ఓటమిపై భారత క్రికెట్ మండలి బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు, సహాయ కోచ్‌ సంజయ్ బంగర్‌పై వేటు వేసేందుకు సిద్ధమైంది. బ్యాట్స్‌మెన్ల ఆటతీరుకు సంబంధించి […]

ప్రపంచకప్‌లో భారత్ ఓటమి.. కోచ్‌పై తొలి వేటు..?
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2019 | 11:45 AM

ఈ సారి ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది టీమిండియా. లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మినహాయించి.. మిగిలిన అన్ని జట్లపైనా విజయం సాధిస్తూ పట్టికలో టాప్‌ ప్లేస్‌ను సాధించిన భారత్.. సెమీ ఫైనల్‌లో 18పరుగుల తేడాతో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. అయితే ఈ ఓటమిపై భారత క్రికెట్ మండలి బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు, సహాయ కోచ్‌ సంజయ్ బంగర్‌పై వేటు వేసేందుకు సిద్ధమైంది. బ్యాట్స్‌మెన్ల ఆటతీరుకు సంబంధించి సరైన సూచనలు చేయడంలో కోచ్ బంగర్ పూర్తిగా విఫలమయ్యాడని, అందు కోసమే అతడిని తప్పించే పనిలో మండలి సమాలోచనలు చేస్తోందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం టీమ్ మొత్తం ఇంగ్లండ్‌లోనే ఉండగా.. వారు స్వదేశానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అయితే మరోవైపు బీసీసీఐలోని ఓ వర్గం సంజయ్ బంగర్‌కు మద్దతు పలుకుతోంది. సెమీఫైనల్‌లో భారత జట్టు ఓటమి పాలు కావడానికి ఏ ఒక్కర్ని తప్పు పట్టాల్సిన అవసరం గానీ, బాధ్యుడిని చేయాల్సిన పని గానీ లేదని అంటున్నారు. కానీ ఈ వైఫల్యంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నందున ఎవరో ఒకరిపై వేటు కచ్చితంగా పడే అవకాశం ఉందని సమాచారం.